టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడు అసలు నాగార్జున సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఎవరు ? మాత్రం వదులుకుంటారు.. ఎవరైనా కండిషన్లు పెడతారా ? అసలు కథ ఏమిటి కాకరకాయ ఏమిటి ? నా పాత్ర ఏమిటి అనేది ఎవరు చూడరు.. వెంటనే సినిమాకు ఓకే చెప్పేస్తారు.. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం నాగార్జున సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అవకాశం వచ్చిన నీ పక్కన హీరోయిన్గా చేయాలంటే నేను చెప్పినట్టు చేయాలి అంటూ చాలా కండిషన్లు పెట్టారట. ఆ హీరోయిన్ ఎవరో ? కాదు జ్యోతిక.
ఒకప్పుడు టాలీవుడ్ ను తన అందచందాలతో ఊపేసిన అరేబియన్ గుర్రం లాంటి హీరోయిన్ నగ్మా. ఆమె తెలుగులో అందరు స్టార్ హీరోలతో నటించింది. ఆమె సోదరి జ్యోతిక.. జ్యోతిక తెలుగులో నాగార్జునతో మాస్ – రవితేజతో షాక్ – చిరంజీవితో ఠాగూర్ సినిమాలు చేసింది. టాలీవుడ్ లో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా డబ్బింగ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో ఆమె నటించిన చంద్రముఖి సినిమా ఆమె క్రేజ్‌ను సౌత్ లో రెట్టింపు చేసింది. అయితే జ్యోతిక లారెన్స్ దర్శకత్వంలో నాగార్జునకు జోడిగా మాస్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నటించేందుకు లారెన్స్ – నాగార్జున జ్యోతికను అప్రోచ్ అయ్యారట.
నాగార్జున సినిమా కదా అని వెంటనే ఓకే చెప్పలేదట. కొన్ని కండిషన్లు కూడా జ్యోతిక పెట్టిందట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ? అప్పటికే ఆమె కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ప్రేమలో ఉంది.. 2006లో సూర్య జ్యోతిక పెళ్లి చేసుకున్నారు. 2004లో మాస్ సినిమా చేసింది.. ఈ సినిమాలో చేసేందుకు జ్యోతిక షూటింగ్ కోసం తప్ప ఇతర విషయాల్లో పెద్దగా ఇబ్బంది పెట్టవద్దని … ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేయనని .. ఎలాంటి రొమాంటిక్ సీన్లు లేకుండా చూడాలని చెప్పిందట. ఈ కండిషన్ కి ఓకే అయితేనే ఆ ప్రాజెక్టుకి సైన్ చేస్తానని పైగా సూర్యతోనే చెప్పించిందట. ఆ కండిషన్లకు ఓకే అనుకున్నకే మాస్ సినిమాలో జ్యోతిక హీరోయిన్గా ఫైనల్ చేశారు.