తండేల్ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్న నాగచైతన్య కెరియర్ మీదే ఫోకస్ పెట్టారు. అయితే పర్సనల్ కెరియర్ అంత బాగుండక పోవడంతో తన ఫోకస్ మొత్తం సినీ కెరీర్ మీదే పెట్టారు.అంతేకాదు నాగచైతన్య ఇప్పట్లో రెండో పెళ్లి కూడా చేసుకునేలా లేరు.అయితే నాగచైతన్య, శోభిత ధూళిపాలను రెండో పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఇప్పటికే మీడియాలో ఎన్నిసార్లు వినిపించాయో చెప్పనక్కర్లేదు. అయితే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు చైతు శోభితకు సంబంధించిన కొన్ని ఫోటోలు మీడియాలో వైరల్ అవ్వడం వల్లనే వీరి మధ్య ఈ రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటికే చాలాసార్లు ఈ ఇద్దరు క్లారిటీ ఇచ్చినప్పటికీ అవి ఆగడం లేదు. ఇక రీసెంట్గా శోభిత చీర కట్టుకున్న ఫోటోలకి కూడా నాగచైతన్య లైక్ కొట్టి వీరి మధ్య నిజంగానే బంధం ఉంది అనేలా మరో కొత్త అనుమానం సృష్టించారు. ఇదిలా ఉంటే నాగచైతన్య ఎప్పటికైనా రెండో పెళ్లి చేసుకోక తప్పదు.కానీ నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం వచ్చిన అమ్మాయిని పీక పిసుకు చంపుతా అంటూ ఓ హీరోయిన్ అంటుందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే..ఆమె మాజీ భార్య సమంత..
విడాకులు అయ్యాక కూడా సమంతకు నాగచైతన్య ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు ఓ సంచలన విషయం బయట పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సమంత నాగచైతన్య మళ్లీ కలుస్తారని మీరు ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అదెలా సాధ్యం అని రామారావు ని అడగగా..నేను ఈ విషయం ఎప్పటినుంచో చెబుతున్నాను.ఇప్పటికే సమంత నాగచైతన్య నుండి దూరమైనందుకు ఎంతగానో మానసిక వేదన అనుభవిస్తుంది.
అంతే కాదు చైతన్యను వదులుకొని నేను చాలా తప్పు చేశాను అని కుమిలి పోతోంది.ఈ విషయం నాకు తెలుసు. ఎందుకు ఆయన్ని మిస్ చేసుకున్నాను అని బాధపడుతుంది. అంతేకాదు ఒకవేళ నాగచైతన్య ఎవరైనా అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమెను సమంత పీక పిసికి చంపినా చంపుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.ఎప్పటికైనా సమంత నాగచైతన్యలు మళ్లీ కలుస్తారు.ఇదే నిజం అంటూ ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.