టాలీవుడ్‌లో బలమైన లెగసీ ఉన్న అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన వారసుడు అక్కినేని నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఏ మాయ చేశావే సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో వీరి కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. పెళ్లయ్యాక జస్ట్ నాలుగేళ్లు కూడా వీరు కలిసి కాపురం చేయలేదు.. అంతలోనే విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. పెళ్లి తర్వాత సమంత – చైతు పక్కా పగడ్బందీగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు.
సమంత కూడా ఓ బేబీ, మజిలీ, జాను సినిమాలు చేసింది. మజిలీ సూపర్ హిట్. ఈ సినిమా సక్సెస్ తర్వాత సమంత-నాగ చైతన్య ఇలాంటి కథల కోసమే తాము వెయిట్ చేస్తున్నట్టు చాలా మంది దర్శకరచయిలకి చెప్పారు. మజిలీ లాంటి కథ తీసుకువచ్చి.. అది మాకు నచ్చితే ఇద్దరూ కలిసి 6 నుంచి 7 కోట్ల రెమ్యునరేషన్ తో సినిమా కమిటవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా 96. ఈ సినిమా తెలుగు రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా ఫేడవుట్ అయ్యిందనుకున్న త్రిషకు మంచి కం బ్యాక్ మూవీగా నిలిచింది. వెంటనే రాజు ఈ సినిమాను తెలుగులో నాగచైతన్య, సమంత కాంబోలో తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందనుకుని ఇద్దరికి కథ చెప్పారు. అయితే చైతుకు కథ నచ్చలేదు.. తాను చేయనన్నాడు.. సమంత మాత్రం పట్టుబట్టి ఈ సినిమా చేసింది. చైతు వద్దని చెప్పినా సమంత – శర్వానంద్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమా ప్లాప్ అయ్యింది. అప్పటికే వీరి మధ్య ఉన్న గ్యాప్‌నకు ఇది మరింత ఆజ్యం పోసినట్లయ్యింది.
శర్వానంద్ – సమంత మధ్య అనుకున్న స్థాయిలో స్క్రీన్ మీద కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు.. అదే మంచి కథ తీసుకుని.. చైతు, సమంత జంటగా చేసి ఉంటే సినిమా ఇరగదీసి ఉండేది. ఇక జాను అవుట్‌ఫుట్ చూశాక దిల్ రాజు కూడా సినిమా ప్లాప్ అని.. ప్రమోషన్లు కూడా పెద్దగా చేయలేదు. సినిమా డిజాస్టర్.. సమంత క్రేజ్ ఒక్కసారిగా ఢమాల్ అంది.. పైగా శర్వానంద్‌తో చేయడం ఆమెకు మైనస్ అయ్యింది. ఫైనల్ గా నాగ చైతన్య జడ్జ్‌మెంట్ నిజమైంది.