Moviesటార్చ‌ర్ పెట్టిందని హీరోయిన్ చెంప ఎడాపెడా వాయించిన మోహ‌న్‌బాబు..?

టార్చ‌ర్ పెట్టిందని హీరోయిన్ చెంప ఎడాపెడా వాయించిన మోహ‌న్‌బాబు..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్టైలే వేరు ఆయనది ముక్కుసూటితనం.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇండస్ట్రీలో చాలామందికి శత్రువు అయ్యారు. అయితే మోహన్ బాబుకు ముందు నుంచి క్రమశిక్షణ ఎక్కువ. తాను సినిమా రంగంలో ఎంత క్రమశిక్షణతో మెలిగారో తెలిసిందే. ఆయన ఇద్దరు వారసులను చాలా వరకు క్రమశిక్షణతో పెంచినా.. ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు చోటుచేసుకుని రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మోహన్ బాబు ఒక అప్‌కమింగ్ హీరోయిన్ విషయంలో వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఆమెపై చేయి చేసుకున్నారన్న పుకార్లు 20 ఏళ్ల క్రితం టాలీవుడ్ ను షేక్ చేశాయి.

ఆ హీరోయిన్ ఎవరో ? కాదు శిల్పా శివానంద్‌. మహేష్ బాబు యువరాజు – చిరంజీవి మాస్టర్ – మోహన్ బాబుతో యమజాతకుడు – బాలయ్యతో వంశోద్ధారకుడు లాంటి సినిమాలలో నటించిన సాక్షి శివానంద్ సోదరి శిల్పా శివానంద్‌ మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు తొలి సినిమా విష్ణు. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్గా శిల్పా శివానంద్‌ను సెలెక్ట్ చేశారు. అప్పటికే శిల్పా అక్క సాక్షి మోహన్ బాబుతో సినిమా చేసి ఉండడంతో ఆ పరిచయం మీద శిల్పా శివానంద్‌ను విష్ణు ప్రక్కన హీరోయిన్ గా సెట్ చేశారు. అయితే శిల్పా శివానంద్‌ తల బీరుసుతనంతో షూటింగ్‌లో హీరోతో పాటు దర్శకుడిని షూటింగ్లో ఉన్న అందరిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే వారట.

దర్శకుడు షాజీ కైలాస్‌తో పాటు హీరో విష్ణు చాలాసార్లు చెప్పి చూసిన శిల్ప అదే తలబిరుసుతో వ్యవహరించే వారట. చివరకు ఈ విషయాన్ని మోహన్ బాబు దృష్టికి తీసుకు వెళ్లడంతో మోహన్ బాబు కూడా రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత సెట్లోనే అందరి ముందు ఆమెపై చేయి చేసుకున్నట్టు అప్పట్లో ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. ఇంకా చెప్పాలి అంటే మోహన్ బాబు శిల్ప శివానంద్‌ చెంపపై గట్టిగా లాగిపెట్టి ఇచ్చారని కూడా అప్పటి సినీ పత్రికలు రాసాయి. ఏది ఏమైనా ఈ విషయం అప్పట్లో సంచలనం అయ్యింది. తర్వాత శిల్పా శివానంద్‌కు ఎవరు ? టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వలేదు. అయితే శిల్పా అక్క సాక్షి శివానంద్ కు మాత్రం టాలీవుడ్ లో మంచి పేరు ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news