Moviesసాయి ధరమ్ తేజ్ కాదు హీరో చిరంజీవితో మెహ్రీన్ పెళ్లి... ప‌క్కా...

సాయి ధరమ్ తేజ్ కాదు హీరో చిరంజీవితో మెహ్రీన్ పెళ్లి… ప‌క్కా ఫిక్స్‌..?

మెహ్రీన్ ఫిర్జాదా మెగా ఇంటికి కోడలుగా వెళ్లబోతుందని, చిరంజీవి మేనల్లుడిని పెళ్లాడబోతుందని గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వినిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మరీ ముఖ్యంగా వీరిద్దరి మధ్య దాదాపు ఏడేళ్లుగా ప్రేమాయణం నడుస్తుందని, వీరిద్దరూ జవాన్ సినిమా నుండే ప్రేమలో ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే మెహ్రీన్ కి ఆల్రెడీ ఓసారి ఎంగేజ్మెంట్ అయింది.

హర్యాణాకి చెందిన రాజకీయ నాయకుడు భవ్య బీష్ణోయ్ తో మెహ్రిన్ కి ఎంగేజ్మెంట్ రద్దయింది. అయితే వీరిద్దరికి దాదాపు ఆరు సంవత్సరాల పరిచయం ఉందని చెప్పారు. అలా ఇంట్లో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ ఎంగేజ్మెంట్ అయ్యాక నాలుగు నెలలకే విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇక మెగా హీరో వల్లే మెహ్రీన్ పెళ్లి చెడిపోయింది అనే టాక్ కూడా వినిపించింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఇదంతా పక్కన పెడితే గత వారం రోజుల నుండి సాయి ధరమ్ తేజ్ మెహ్రీన్ ల పెళ్లి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంతో మంది క్లారిటీ ఇస్తున్నారు. అయినా ఈ వార్తలు ఆగడం లేదు. అయితే తాజాగా మెహ్రీన్ గురించి ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే మెహ్రీన్ సాయి ధరమ్ తేజ్ ని కాదు ఆ నటుడిని పెళ్లాడబోతున్నట్టు, ఆయనతో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆయన ఎవరో కాదు గుజరాత్ కి చెందిన నటుడు నిర్మాత అయిన చిరంజీవి మక్వానా.. ఈయన గుజరాతి సినిమాల్లో నిర్మాతగా..నటుడిగానే కాకుండా యానిమేషన్ డైరెక్టర్ గా కూడా చేస్తున్నారు. అయితే అలాంటి చిరంజీవి మక్వానాతో మెహ్రిన్ డేటింగ్ లో ఉందని గత కొద్ది రోజులుగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతుందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.మరి చూడాలి పెళ్లి చిరంజీవి తోనా లేక సాయి ధరమ్ తేజ్ తోనా అనేది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news