టాలీవుడ్‌లో చాలామంది హీరోలు, దర్శకులు నటసింహం బాలయ్యకు వీరాభిమానులు. బాలయ్య పేరు ఎత్తితే చాలు జై బాలయ్య అంటూ పూనకాలు తెచ్చేసుకుంటారు. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగువారు ఏ దేశంలో సినిమా చూస్తున్నా కూడా.. ఏ హీరో సినిమా చూస్తున్నా కూడా.. జై బాలయ్య, జై జై బాలయ్య అన్న స్లోగన్‌లు కామన్ అయిపోయాయి. ఇక ఇటీవల కాలంలో చాలా మంది పెద్ద హీరోలు సైతం తమ సినిమాల్లో రిఫరెన్సులుగా బాలయ్యని వాడేసుకుంటున్నారు.
ఇక మెగా ఫ్యామిలీ సినిమాలలోనూ బాలయ్య రిఫరెన్సులు కనిపించడం.. ఆ పేరు వాడుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన ఆహా ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో అన్‌స్టాపబుల్ టాక్ షో హోస్ట్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇక పలువురు మెగా హీరోలు సైతం తమ సినిమాల ఫంక్షన్లు.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో జై బాలయ్య నినాదాలు చేస్తున్నారు. తాజాగా అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ ఆగస్టు 2న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో బాలయ్య రిఫరెన్సులు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో టెడ్డీబేర్‌కు ఓ పాత్ర ఉంది. ఆ పాత్రతో క్లైమాక్స్‌లో జై బాలయ్య అంటూ పలికించారు. భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన థీం మ్యూజిక్ కూడా సినిమాలో వాడేసారు.
అలా మెగా సినిమాలో బాలయ్యని ప్రస్తావించడం.. ఆ పేరు వాడుకోవడం షాకింగ్ విషయం. ఇది ఓరకంగా మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఇప్పుడు సొంత హీరోలని స్తుతించటం.. వాళ్ళని వాడేయటం చూసి.. చూసి.. సినీ ప్రేక్షకులకు కూడా బోరు కొట్టేసింది. కాకపోతే ఇది మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ సినిమా.. తను పెద్దగా రెఫరెన్సుల జోలికి వెళ్లడు. ఇంట్లో పాన్ ఇండియా స్టార్ బన్నీ ఉన్నాడు. కావాలంటే తన రిఫరెన్స్ వాడుకోవచ్చు. కానీ శిరీష్ ఇప్పుడు అలా చేయలేదు. ఈసారి ఏకంగా బాలయ్య నామ జపం చేయటం విచిత్రంగా ఉంది. ఈ సినిమాపై శిరీష్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక రెండు వారాల ముందు నుంచి ప్రీమియర్లు హడావుడి కూడా మొదలైంది. ఈ వారమే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రాయన్ సినిమా కోసం ఓ వారం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.