మర్యాద రామన్న, మిర్చి.. తెలుగు సినీ ప్రియులను ఈ రెండు చిత్రాలు ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి డైరెక్ట్ చేసిన మర్యాద రామన్న సినిమాలో కమెడియన్ సునీల్, సలోని జంటగా నటించారు. ఇదొక యాక్షన్ కామెడీ డ్రామా. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 2010లో రిలీజ్ అయిన మర్మాద రమ్మన్న చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
మిర్చి మూవీ విషయానికి వస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాతో కొరటాల శివ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించారు. యువి క్రియేషన్స్ నిర్మించిన మిర్చి మూవీ 2013లో అన్ సీజన్ లో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.
అయితే సునీల్ హీరోగా చేసిన మర్యాద రామన్న మరియు ప్రభాస్ యొక్క మిర్చి చిత్రాలకు ఒక లింక్ ఉంది. మర్యాద రమన్న కోసం దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాదు శివార్లలో కోకాపేట్ వద్ద ఒక భారీ ఇంటి సెట్ ను నిర్మించారు. మర్యాద రమన్నలో ఆ ఇల్లు చాలా బాగా హైలెట్ అయింది. అలాగే దాదాపు 70 శాతం షూటింగ్ ను ఆ ఇంట్లోనే పూర్తి చేశారు. ఒకరకంగా మర్యాద రమన్న స్టోరీలో ఆ ఇంటి పాత్ర ఎంతో కీలకంగా కనిపిస్తుంది.
అయితే సరిగ్గా గమనించారంటే మిర్చి మూవీలో కూడా మనకు అదే ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ ఫ్యామిలీ ఉండటాన్ని మనం చూడవచ్చు. మర్యాద రమన్న కోసం కోకాపేట్ వద్ద రాజమౌళి నిర్మించిన ఇంట్లోనే కొరటాల శివ మిర్చి మూవీ షూటింగ్ ను ప్రారంభించారు. సినిమాలోని పలు కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. మిర్చి మూవీ సెకండాఫ్ మొత్తం ఈ ఇంట్లోనే సాగుతుంది.