Moviesప్ర‌భాస్ మూవీతో ఇండ‌స్ట్రీలోకి లాంచ్ అవుతున్న మారుతి కూతురు.. డైరెక్ట‌ర్ గారి...

ప్ర‌భాస్ మూవీతో ఇండ‌స్ట్రీలోకి లాంచ్ అవుతున్న మారుతి కూతురు.. డైరెక్ట‌ర్ గారి అమ్మాయిని చూశారా?

టాలీవుడ్ లో మినిమం హిట్ గ్యారెంటీ చిత్రాలను అందించే దర్శకుల్లో మారుతి ఒకడు. ఈ రోజుల్లో మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన మారుతి.. బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రమ్ వంటి మూవీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇన్నాళ్లు యంగ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన మారుతి.. గత ఏడాది ఏకంగా పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజా సాబ్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద టిజి విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న హారర్-కామెడీ మూవీ ఇది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న రాజా సాబ్ త్వ‌ర‌లోనే థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతోంది. అయితే ఈ సినిమాకు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. రాజా సాబ్ ద్వారా డైరెక్ట‌ర్ మారుతి కూతురు హియ ఇండ‌స్ట్రీలోకి లాంచ్ కాబోతోంది.

న‌టిగా మాత్రం కాదండోయ్‌.. హియ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. చిన్న‌త‌నం నుంచి తండ్రి మారుతి మాదిగానే హియా కూడా క్రియేటివ్ సైడ్ ఎక్కువ మ‌క్కువ చూపుతోంది. రీసెంట్ గా ఇంటర్ కంప్లీట్ చేసిన హియ‌.. త్వరలో హ‌య్య‌ర్ స్ట‌డీస్ కోసం అబ్రాడ్ కి వెళ్ల‌బోతోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది.

సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో హియ కూడా భాగ‌మైంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తో వర్క్ చేయ‌డం అంటే హియ‌కు చాలా ఇష్టం. ఎప్పటికైనా నాగ్ అశ్విన్ తో కలిసి పనిచేయాల‌నేది ఆమె డ్రీమ్‌. జామ్ జంక్షన్ అనే ఓ మ్యూజిక్ బ్యాండ్స్ కి సంబంధించిన ఈవెంట్ లో తండ్రి మారుతితో క‌లిసి హాజ‌రైన హియ ఈ విషయాల‌ను స్వ‌యంగా పంచుకుంది. ఇక హియ తమ్ముడు మ్యూజిక్ వైపు వెళ్తున్నాడు. ప్రస్తుతం డ్రమ్మర్స్, పియానో ప్లే చేస్తున్నాడ‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news