Moviesఅప్పుడే ఐటెం సాంగ్ చేయబోతున్న మమిత బైజు..ఏ సినిమాలో అంటే..?

అప్పుడే ఐటెం సాంగ్ చేయబోతున్న మమిత బైజు..ఏ సినిమాలో అంటే..?

అఫ్కోర్స్.. సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా సరే ఐటమ్ సాంగ్ చేయడం సర్వసాధారణం . దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది ఎంతటి హాట్ బ్యూటీ అయినా సరే ..ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక సినిమాలో కచ్చితంగా ఐటమ్ సాంగ్ లో నటించే ఉంటుంది . సిచువేషన్ డిమాండింగ్స్ అలా ఉంటాయి. అయితే కెరియర్ స్టార్టింగ్ లోనే ఐటమ్ సాంగ్ లో నటించిన హీరోయిన్స్ చాలా చాలా తక్కువ .

ఆ లిస్టులోకే రాబోతుంది అందాల ముద్దుగుమ్మ మలయాళీ హాట్ బ్యూటీ మమితా బైజు. ప్రేమలు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మమిత బైజు తెలుగులో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ప్రజెంట్ విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమాలో.. అదేవిధంగా రామ్ చరణ్ సరసన మరొక సినిమాలో నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ బ్యూటీకి ఇప్పుడు మలయాళం లో ఒక బిగ్ బంపర్ ఆఫర్ వచ్చిందట .

ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ లో నటించబోతుంది అంటూ తెలుస్తుంది . అది కూడా ఓ మలయాళీ సూపర్ స్టార్ హీరో కొడుకు సినిమాలో. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. నిన్న కాకమొన్న కెరియర్ స్టార్ట్ చేసిన మమిత బైజు ..అప్పుడే ఐటెం సాంగ్ లో నటించబోతుందా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. మొత్తానికి ఏదో స్ట్రాటజీతోనే అమ్మడు ముందుకు వెళ్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news