టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లతో.. వయసులో తనకంటే సీనియర్ హీరోయిన్లతో నటించారు. రాజకుమారుడు సినిమాలో ప్రీతిజింతా, మురారి సినిమాలో సోనాలి బింద్రే, అతిధి సినిమాలో అమృతారావు, భరత్ అనే నేను సినిమాలో కియారా అద్వానీ, వన్ సినిమాలో కృతి సనన్, వంశీ సినిమాలో నమ్రత శిరోద్కర్ ఇలా.. ఎలా చూసిన మహేష్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక మహేష్ బాబు కెరీర్లో ఎన్నో ఆశలతో చేసిన బిగ్ డిజాస్టర్ అయిన సినిమా అతిధి.
సురేందర్ రెడ్డిని నమ్మి మహేష్ బాబు అవకాశం ఇస్తే.. డిజాస్టర్ తీసి చేతిలో పెట్టాడు. ఈ సినిమాలో మహేష్ బాబు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అమృత రావు నటించింది. పోకిరి సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్‌కు వెంటనే గుణశేఖర్ సైనికుడు లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అతిథి సినిమా వచ్చింది. ఈ బ్యూటీ మహేష్ బాబుకి తెగ నచ్చేసింది. అందుకే పట్టుబట్టి ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అమృత మళ్లీ తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్లో ఆమె తక్కువ సినిమాలే చేసినా అక్కడ మంచి క్రేజ్ ఉంది.
ఆ క్రేజ్ చూసి ఇష్టపడి మహేష్ తెలుగులో ఆమెకు అతిధి సినిమాలో అవకాశం ఇచ్చాడు. కానీ.. ఆమె బ్యాడ్‌లక్ ఏంటంటే..? ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అమృతకు మళ్ళీ సౌత్ లో అవకాశాలు రాలేదు. కావలసినంత అందంతో పాటు.. హైట్, మంచి నటన ఉండి కూడా అమృత తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. పేరుకు మాత్రం మహేష్ బాబు పక్కన సినిమా చేశాను అని చెప్పుకున్నా.. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అమృత అడ్రస్ లేకుండా పోయింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మూడున్నర సంవత్సరాల వరకు సినిమా చేయలేదు. అంటే ఈ సినిమా రిజల్ట్ మహేష్ కెరీర్‌పై ఎంతలా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.