నటి ప్రేమ.. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ ప్రేక్షకులకు అత్యంత సుప్రసిద్ధురాలు. బెంగళూరులో జన్మించిన ప్రేమ.. 1995 లో విడుదలైన సవ్యసాచి అనే కన్నడ మూవీతో తన కెరీర్ ప్రారంభించింది. రెండో సినిమా ఓం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది. చాలా తక్కువ సమయంలోనే కన్నడ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ప్రేమ ముద్ర వేయించుకుంది.
1996లో ధర్మచక్రం మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రేమ.. జగదేకవీరుడు, అత్త నీ కొడుకు జాగ్రత్త, కోరుకున్న ప్రియుడు, చెలికాడు, ఓంకారం, దేవి, మా ఆవిడ కలెక్టర్ తదితర చిత్రాల్లో నటించింది. అలాగే తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసింది. ప్రేమ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2006లో ఆమె జీవన్ అప్పచ్చు అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత కూడా మూడేళ్ల పాటు సినిమాల్లో నటించిన ప్రేమ.. 2009 నుంచి కెమెరాకు దూరంగా ఉంది.
ఇక జీవన్ మరియు ప్రేమ దాంపత్య జీవితం కొన్నాళ్లు బాగానే సాగిన.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అవి పెరిగి పెరిగి విడాకులకు దారితీశాయి. 2016లో బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో జీవన్, ప్రేమ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో విడాకులపై ప్రేమ స్పందిస్తూ.. జీవితంలో పెళ్లి ముఖ్యమే కానీ అదే జీవితం కాదు.. ఉన్నది ఒకే ఒక జీవితం. అందులో మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అన్నదే అసలైన జీవితం. నాకు నచ్చినట్టు ఉండటం కోసం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటా అని చెప్పుకొచ్చారు.
భర్తతో జీవతం సంతోషంగా లేకపోవడం వల్లే విడాకులు తీసుకున్నట్లు ప్రేమ స్పష్టం చేసింది. ఇకపోతే కన్నడ ఇండస్ట్రీలో ప్రేమ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో హీరో ఉపేంద్రతో ఆమె ఎఫైర్ నడుపుతున్నట్లు బలంగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రేమ కొట్టిపారేసింది. ఉపేంద్ర ఎప్పుడూ నాతో కలిసి మాట్లాడింది లేదు.. అలాంటిది మా ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ రాసేశారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. విమర్శలతో పాటు గాసిప్‌లు వస్తుంటాయి. వాటిని పట్టించుకోకూడదని ప్రేమ తేల్చేంది.