టాలీవుడ్ ఇండస్ట్రీలో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి పూరి జగన్నాథ్ వరుస సినిమాలు చేస్తూ మంచి జోరు మీదున్నారు. అయితే ఆ మధ్యకాలంలో కొన్ని ఫ్లాప్స్ చవిచూసిన ఈ డైరెక్టర్ కి ఇస్మార్ట్ శంకర్ సినిమా మళ్లీ లైఫ్ ఇచ్చింది.ఇక ఆ మధ్యకాలంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ దెబ్బ తీసినప్పటికీ ప్రస్తుతం తన ఆశలన్నీ డబల్ ఇస్మార్ట్ మీదే పెట్టుకున్నారు. ఇక ఆయన సినీ కెరీర్ కాస్త పక్కన పెడితే పూరి లావణ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఓసారి లావణ్య సినిమా షూటింగ్ చూడ్డానికి వచ్చిన సమయంలో ఆమెను చూసిన తొలిచూపులోనే పూరి జగన్నాథ్ ప్రేమలో పడిపోయి డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్లి తన విసిటింగ్ కార్డు ఇచ్చి నీకు నేను నచ్చి పెళ్లి చేసుకోవాలనిపిస్తే నాకు కాల్ చేయి అని చెప్పారట.
ఇక షాక్ అయిపోయిన లావణ్య ఓ వారం రోజులకి పూరి జగన్నాథ్ కి ఫోన్ చేసి నీకు ఇదే పనా.. ఇప్పటివరకు ఎంతమంది అమ్మాయిలకు ఇలా విసిటింగ్ కార్డ్స్ ఇచ్చి ఫోన్ చేయమన్నావు అని అడిగిందట. అలా ఇద్దరి మధ్య మాటలు పెరిగి ప్రతిరోజు మాట్లాడుకున్నారట. ఇక లావణ్యని పూరి జగన్నాథ్ ప్రేమించిన సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే. అప్పట్లో ఆయనకు జీతం కూడా ఎక్కువగా వచ్చేది కాదు. ఓసారి లావణ్య గురించి ఓ విషయం తెలిసి వదిలేద్దామనుకున్నారట.
అదేంటంటే.. ప్రేమికులన్నాక బయట తిరగడం, షికార్లు వంటివి ఉంటాయి.అలాగే లావణ్య కూడా ఓ రోజు కాల్ చేసి బయటికి వెళ్దామని చెప్పిందట. దాంతో పూరి జగన్నాధ్ తన ఫ్రెండ్ దగ్గర అప్పుచేసి ఓ రెస్టారెంట్ కి తీసుకువెళ్లారట.అక్కడికి వెళ్ళాక లావణ్య ఒక తందూరి కోడి మొత్తం ఆర్డర్ చేసిందట. కానీ పూరి జగన్నాథ్ అసలు తందూరి కోడి తినరట. ఇక లావణ్య ముందు ఏదో తిన్నట్టు యాక్టింగ్ చేసి స్పూన్స్ అటు ఇటు కదుపుతూ ఉన్నారట.కానీ ఆయన యాక్టింగ్ చేసే లోపే లావణ్య తందూరి కోడి పూర్తిగా లాగించేసిందట.
ఇక ఆ టైంలో లావణ్య తిండి చూసిన పూరి జగన్నాథ్ భయపడి పోయి వామ్మో ఈ అమ్మాయిని మెయింటైన్ చేయడం నావల్ల కాదు. నా దగ్గర అసలు డబ్బులు కూడా లేవు. ఈమె తిండికి నేనేం ఖర్చు పెట్టగలను అని భయపడిపోయారట. అంతేకాదు ఆ టైంలో ఆమెను వదిలేయాలి అనుకున్నారట.
ఇక రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఇప్పటినుండి కలవడాలు ఇవన్నీ వద్దు. డైరెక్ట్ పెళ్లి చేసుకునేటప్పుడే కలుద్దాం అని పూరి చెప్పారట. దాంతో లావణ్య ఓ రోజు కాల్ చేసి మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో పూరి జగన్నాథ్ షాక్ అయ్యాడట.
ప్రస్తుతం నా దగ్గర 200 ఉన్నాయి మరి ఎలా అని అంటే.. నీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా నేను నీతో ఉంటాను నువ్వే కావాలి అని వచ్చేసిందట. ఇక ఆ సమయంలో పూరి జగన్నాథ్ నిన్నే పెళ్ళాడుతా సినిమా షూటింగ్లో ఉన్నారట. ఇక అదే రోజు బ్రేక్ టైం లో వీరిద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారట.ఇక పెళ్లి చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఫ్రెండ్స్ అందరూ తలా ఇన్ని డబ్బులు తెచ్చి ఒకరు మంగళసూత్రం, మరొకరు పెళ్లి బట్టలు, ఇంకొకరు కూల్ డ్రింక్స్ అరేంజ్ చేసి వీరి పెళ్లిను చేశారట. అలా వెరైటీగా పూరి జగన్నాథ్,లావణ్య ల పెళ్లి జరిగింది అని పూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.