టాలీవుడ్ యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రముఖ హీరోయిన్ రహస్య గోరక్ తో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో రాజావారు రాణిగారు సినిమాతో ఈ జంట హీరోహీరోయిన్లుగా సినిమా పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. ఈ మూవీ సమయంలోనే ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో ఈ ఏడాది మార్చి 13న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ పెళ్లి పీటలు ఎక్కేది ఎప్పుడూ అన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. వచ్చే నెలలోనే కిరణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నేడు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కావడంతో హీరోయిన్ రహస్య సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టింది. తమ లవ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి దిగిన ఫోటోలను మరియు స్పెషల్ మూమెంట్స్ ను కలిపి ఒక వీడియో లాగా క్రియేట్ చేసి ఇన్‌స్టా వేదిక పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా రహస్య కాబోయే భర్తకు బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు పరోక్షంగా పెళ్లి తేదీని ప్రకటించింది. నిన్ను నా భర్తగా పిలిచేందుకు చాలా ఆత్రుతగా ఉన్నాను.. అందుకు ఇంకా 38 రోజులే ఉంది అని తన పోస్ట్ లో రహస్య రాసుకుంది. ఈమె పోస్ట్ ప్రకారం.. కిరణ్, లావణ్య వివాహం ఆగస్టు 22న జరగబోతుందని స్పష్టమైంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అలాగే కిరణ్ అబ్బవరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.