ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన కల్ట్ క్లాసిక్ భారతీయుడు చిత్రానికి తాజాగా డైరెక్టర్ శంకర్ సీక్వెల్ అంటూ భారతీయుడు 2 చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించగా.. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని, ఎస్.జె సూర్య తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన భారతీయుడు 2 మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో జూన్ 12న విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడలంలో విఫలం అయింది. ఆడియన్స్ నుంచి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఎప్పట్లాగానే కమల్ హాసన్ తన నటనతో అలరించినా.. డైరెక్టర్ శంకర్ మార్క్ సినిమాలో కనపడలేదని చాలామంది అభిప్రాయబడ్డారు.
ఓపెనింగ్స్ పరంగా కూడా ఈ చిత్రం నిరాశ పరిచింది. ఇదిలా ఉంటే..భారతీయుడు 2 మూవీకి కమల్ హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. భారతీయుడు మూవీకి మొదట సీక్వెల్ ఒకటే అనుకున్నప్పటికీ.. అది కాస్త రెండు భాగాలు అయింది. ఇప్పుడు భారతీయుడు 2 రిలీజ్ చేయగా.. మరో ఆరు నెలల్లో మూడో భాగాన్ని విడుదల చేయనున్నారు.
ఈ రెండు భాగాల బడ్జెట్ దాదాపు రూ. 500 కోట్లకు చేరిందని ఇన్సైడ్ బలంగా టాప్ నడుస్తోంది. అయితే భారతీయుడు 2 ఫలితం కమల్ హాసన్ ముందే పసిగట్టాడో ఏమో గానీ విడుదలకు ముందే ఫుల్ రెమ్యునరేషన్ సెటిల్ చేయాలని పట్టు పట్టారట. దాంతో లైకా ప్రొడక్షన్ వారు రెండు భాగాలకు కలిపి రూ. 75 కోట్లు చొప్పున మొత్తంగా రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ గా కమల్ హాసన్ కు ముట్టజెప్పారట. సినిమా మొత్తం ఖర్చులో 30% ఆయన రెమ్యునరేషనే అని వార్తలు వస్తున్నాయి.