పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణంలో దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతోమంది స్టార్స్ భాగమైన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.
ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే కల్కి సక్సెస్ తో ప్రభాస్ రెమ్యునరేషన్ చిన్న స్థాయి ప్రొడ్యూసర్స్ ఊహకు కూడా అందనంత ఎత్తుకు చేరుకుంది. ప్రభాస్ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. ఇప్పటివరకు ఒక్క చిత్రానికి రూ. 100 నుంచి 150 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు.
ఇక తాజాగా కల్కి వచ్చింది. ప్రభాస్ ను ఇండియన్ బాక్సాఫీస్ కి కింగ్ గా మార్చింది. ప్రభాస్ ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా పాకేలా చేసింది. కల్కి సక్సెస్ తో ఆయన మార్కెట్ మరో 10 రెట్లు పెరిగింది. ప్రభాస్ సినిమాల థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయి ధర పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన రెమ్యునరేషన్ ను మరో రూ. 50 కోట్లు పెంచాడని బలంగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం డార్లింగ్ ఒక్కో చిత్రానికి రూ. 200 కోట్లు ఛార్జ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. దీంతో సౌత్ లోనే హైయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ప్రభాస్ అగ్ర స్థానంలో నిలిచాడు. అలాగే నార్త్ లో ఒకరిద్దర్ని మినహా మిగతా హీరోలందరినీ రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్ బీట్ చేసేశాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి 2, స్పిరిట్, రాజా సాబ్, సలార్ 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఉన్నాయి. వీటితో మారుతి డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.