సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఈయన అప్పట్లో బొంబాయి ప్రియుడు, మనీ మనీ,అనగనగా ఒక రోజు,గులాబి,ఎగిరే పావురమా వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.అలాగే ఈయన నాగార్జున హిట్ మూవీ అయిన శివ లో విలన్ గా కూడా మెప్పించారు. అయితే అలాంటి జె.డి చక్రవర్తి అప్పట్లో ఓ హీరోయిన్ తొడలు చూడడం కోసం అర్ధరాత్రి అలాంటి పని చేసే వారట.అయితే ఈ విషయం రూమర్ కాదు స్వయంగా ఓ నటుడు దీన్ని బయటపెట్టారు.
మరి ఇంతకీ జె.డి చక్రవర్తి అర్ధరాత్రి చేసిన పని ఏంటి.. అసలు ఆయన ఏ హీరోయిన్ కోసం అలాంటి పని చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. జె.డి చక్రవర్తి సీనియర్ నటి రంభ తొడలు చూడడం కోసం అర్ధరాత్రి అక్కడికి వెళ్లేవారట. ఇక అసలు విషయం ఏమిటంటే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా.. విలన్ గా.. టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు ఉత్తేజ్ అందరికీ తెలిసే ఉంటుంది.అయితే ఉత్తేజ్ అప్పట్లో ఓ సినీ ఈవెంట్లో జె.డి. చక్రవర్తి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.
అయితే జెడి చక్రవర్తి ఉత్తేజ్ మధ్య ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉందనే సంగతి ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలుసు.ఇక తన ఫ్రెండ్ జె డి చక్రవర్తి గురించి ఆ ఈవెంట్ లో అప్పట్లో మా ఇద్దరి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉండేది. సినిమాల్లోకి రాకముందే మా మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. అయితే అప్పట్లో అర్ధరాత్రి సమయంలో జెడి చక్రవర్తి నేను ఓ కారులో పంజాగుట్ట కి వెళ్లే వాళ్ళం.
అక్కడ రంభ తొడలు చూసి మళ్లీ తిరిగి వచ్చే సమయంలో కటౌట్ పెద్దదిగా ఉంటే అబ్బా ఏం అందంగా ఉన్నాయి రా అంటూ మాట్లాడుకునేవాళ్లం. అయితే అప్పట్లో పంజాగుట్ట సెంటర్లో రంభ కి సంబంధించిన కటౌట్ పెట్టిన సమయంలో ఉత్తేజ్,జె.డి.చక్రవర్తి కలిసి కారులో అక్కడికి వెళ్లి ఆమె కటౌట్ చూసి వచ్చేవారట. అలా అప్పటి ఓ ఫన్నీ విషయాన్నీ ఉత్తేజ్, జె.డి.చక్రవర్తి నటించిన దయా అనే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.