తెలుగు హీరోయిన్ల రెమ్యునరేషన్లు రెమ్యునరేషన్లు ఎంతెంత ఉంటాయి… మహా అయితే రు. 10 లక్షల నుంచి రు. 2 కోట్ల వరకు ఉంటాయి. నయనతార, త్రిష లాంటి వాళ్లు నాలుగు పదుల వయస్సుకు చేరువ అవుతోన్న వేళ రు. 5 – 6 కోట్ల వరకు తీసుకుంటారు. అయితే ఇప్పుడు అంతా పాన్ ఇండియా మోజు నడుస్తోంది. అందుకోసం బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవాలి… మృణాల్ ఠాగూర్ లాంటి వాళ్లు రు. 3 కోట్ల వరకు తీసుకుంటారు.
అయితే ఇప్పుడు టాలీవుడ్‌లోనూ జాన్వీకపూర్ టైం నడుస్తోంది. జాన్వీకపూర్‌ను చూసేయాలన్న ఆతృత తెలుగు ప్రేక్షకులకు మామూలుగా లేదు. ఈ క్రమంలోనే గత నాలుగేళ్లుగా ఆమెను తెలుగు సినిమాల్లో నటింపజేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో జాన్వీని తీసుకునేందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ విశ్వప్రయత్నాలు చేశారు. అప్పట్లోనే ఆమె చెప్పిన రేటు విని పూరి సైలెంట్ అయిపోయాడు.
పూరి మాత్రమే కాదు … మరో ఒకరిద్దరు దర్శకులు కూడా జాన్వీ కోసం ట్రైల్స్ వేసి చేతులు కాల్చుకున్నారు. చివరకు దేవర సినిమా కోసం కొరటాల – ఎన్టీఆర్ ఎట్టకేలకు జాన్వీని ఒప్పించారు. ఆ తర్వాత రామ్‌చరణ్ – బుచ్చిబాబు సినిమా కూడా ఓకే అయ్యింది. చరణ్, బుచ్చిబాబు సినిమాకు భేరం మూడున్నర కోట్లకు సెటిల్ అయ్యిందట. అయితే ఇప్పుడు ఆమె కొత్త రేటు రు. 8 కోట్లు చెపుతోందట.
అంటే భేరసారాలు రు. 8 కోట్ల నుంచి మొదలవుతాయి. అది ఎక్కడకు తెగుతుందో ? ఎక్కడ ఆగుతుందో ? చూడాలి. ఇప్పుడు నాని సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కోసం నాని కొత్తవాడు కావడంతో పాటు.. నానికి జాన్వీ వల్ల పాన్ ఇండియా మార్కెట్ వస్తుందన్న లెక్కలు ఉండడంతో అదనంగా మరో రు. 50 లక్షలు లేదా కోటి రెమ్యునరేషన్ ఉంటుందని కూడా చర్చ నడుస్తోంది. ఇక స్టాఫ్ ఖర్చులు, అవిఇవి కలుపుకుంటే ఆమె రెమ్యునరేషన్ రు. 5 కోట్లు దాటేస్తుందంటున్నారు. ఈ కొత్త రేటు చూస్తే తెలుగు నిర్మాతలకు అయితే గుండెళ్లో రైళ్లే పరిగెట్టేస్తున్నాయి.