Moviesజాన్వీక‌పూర్‌పై నానికి ప్రేమ‌కు అస‌లు కార‌ణం ఇదా..?

జాన్వీక‌పూర్‌పై నానికి ప్రేమ‌కు అస‌లు కార‌ణం ఇదా..?

దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ను తెలుగులో నటింపజేసేందుకు గత మూడు నాలుగు సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఆమె హీరోయిన్గా చేస్తోంది. దేవ‌ర పాన్ ఇండియా సినిమా.. అందులోనూ గ‌తంలో జాన్వీ త‌ల్లి శ్రీదేవి.. ఇటు ఎన్టీఆర్ తాత సీనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాలు సూప‌ర్ హిట్ కావ‌డంతో ఈ క్రేజీ కాంబినేష‌న్‌పై అంచ‌నాలు మామూలుగా లేవు.

ఈ సినిమా విడుదల కాకుండానే జాన్వికి తెలుగులో మరో రెండు అవకాశాలు వచ్చేసాయి. ఎన్టీఆర్ తో దేవర చేస్తుండగానే రామ్ చరణ్‌తో సినిమా ఓకే అయింది. త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇప్పుడు మరో సినిమాకు కూడా జాన్వీని టాలీవుడ్ లో హీరోయిన్గా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని పట్టు పట్టి జాన్వీకపూర్‌ను తన సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని ప్రయత్నం చేసి సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల‌ కాంబినేషన్లో నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించే సినిమాకు జాహ్నవిని హీరోయిన్గా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు విషయంలో నాని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. దసరా సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నానికి మంచి పేరు కూడా వచ్చింది. అందుకే అదే దర్శకుడు శ్రీకాంత్ కు నాని మరో అవకాశం ఇచ్చారు. ఇది కూడా భారీ బడ్జెట్ తో తీయాల్సిన డిఫరెంట్ సబ్జెక్టు.. పైగా పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాలో జాన్వీని హీరోయిన్‌గా తీసుకుంటే బాలీవుడ్ లో కూడా నానికి క్రేజ్ వస్తుంది. నాని తన క్రేజ్ కోసం జాన్విని ఇలా వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకే కాస్త భారీ బడ్జెట్ అయినా.. ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చే జాన్వీని హీరోయిన్గా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని నటిస్తున్న సరిపోదా శనివారం తర్వాత చేసే సినిమా ఇదే కావటం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news