Moviesఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచిన‌ ఇంద్ర‌ మూవీలో ఇంత పెద్ద మిస్టేక్...

ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచిన‌ ఇంద్ర‌ మూవీలో ఇంత పెద్ద మిస్టేక్ ఉందా..?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇంద్ర ఒకటి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. చిన్ని కృష్ణ కథ అందించగా.. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

22 ఏళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజు అంటే 2002 జూలై 24న మొత్తం 268 స్క్రీన్ లపై విడుదలైన ఇంద్ర మూవీ ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ తో తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద వీర విహారం చేసింది. అప్ప‌ట్లోనే రూ. 55 కోట్ల రేంజ్ లో వసూళ్లను కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మొదటి వారంలో రూ. 20 కోట్లకు పైగా క‌లెన్స్ ను వ‌సూల్‌ చేసిన మొదటి తెలుగు సినిమాగా కా రికార్డు సృష్టించింది.

122 కేంద్రాల్లో శతదినోత్సవం, 32 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుని రికార్డులు తిరగరాసింది. అలాగే ఆదోని సత్యం థియేటర్ లో ఇంద్ర చిత్రం 247 రోజులు ప్రదర్శనమైంది. చిరంజీవి సిని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఇంద్ర చోటు దక్కించుకుంది. అదే స‌మ‌యంలో చిరంజీవికి బెస్ట్ యాక్ట‌ర్ గా నంది అవార్డును అందించింది. అయితే అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఇంద్ర సినిమాలో పెద్ద మిస్టేక్ ఉందన్న సంగతి మీకు తెలుసా.. బహుశా తెలిసుండకపోవచ్చు. ఎందుకంటే ఇంద్ర సినిమాను ప‌ది, ప‌దిహేను సార్లు చూసినవారు కూడా ఆ మిస్టేక్ ను గుర్తించలేకపోయారు.

ఇంతకీ ఆ మిస్టేక్ ఏంటంటే.. సినిమా సెకండ్ హాఫ్ లో ఘల్లు ఘల్లుమని సాంగ్ అనంత‌రం ఇంద్ర సేనుడి ఇంట్లో హోళీ పండుగ జ‌రుగుతుంది. అత‌ని కుటుంబ‌స‌భ్యులంద‌రూ రంగులు పూసుకుంటూ హుషారుగా హోళీ ఆడ‌తారు. అయితే అదే రోజు రాఖీ పండుగ అన్న‌ట్లుగా కూడా డైరెక్ట‌ర్ చూపించారు. చిరంజీవికి ఇద్ద‌రు సిస్ట‌ర్స్ రాఖీ క‌డ‌తారు. వాస్త‌వానికి రాఖీ, హోళీ పండుగ‌ల ఒకేసారి రావు. కానీ డైరెక్ట‌ర్ బి.గోపాల్ మాత్రం రెండు పండుగ‌ల‌ను ఒకే రోజు చూపించి మిస్టేక్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news