కల్కి.. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా . ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి ఎలాంటి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుందో మనకు తెలిసిందే. దీపికా పదుకొనే హీరోయిన్గా .. దిశాపటాని కీలక పాత్రల్లో అమితాబచ్చన్ అదేవిధంగా కమల్ హాసన్ చాలా చాలా స్టన్నింగ్ పాత్రలో కనిపించిన సినిమానే ఈ కల్కి. జూన్ 27 వ తేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది.
ఈ సినిమాలోని క్యారెక్టర్స్ కి స్పెషల్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించారు నాగ్ అశ్వీన్. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కృష్ణుడి పాత్రకు తమిళ నటుడు అర్జున్ దాస్ చెప్పిన డబ్బింగ్ హైలెట్గా మారింది . ఇదే క్రమంలో మరొక వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన దీపికా పదుకొనే పాత్రకు ఒక తెలుగు హీరోయిన్ డబ్బింగ్ చెప్పింది అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
ఆమె మరెవరో కాదు శోభిత ధూళిపాళ్ల. దీపికా ఈ సినిమాలో సుమతి పాత్రలో కనిపించింది . ఈ పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి. సుమతి అనే పాత్రలో కల్కి కి జన్మనివ్వబోయే తల్లిగా కనిపించింది. ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టర్ అని చెప్పాలి . ఈ పాత్రకు తనదైన స్టైల్ లో డబ్బింగ్ చెప్పింది తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల . ఇదే విషయాన్ని చెప్తూ స్క్రీన్ మీద శోభితకు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పారు చిత్ర బృందం. హాలీవుడ్ లో కూడా ఇటీవల ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ శోభిత ధూళ్ళిపాళ్ల..!!