Moviesహడావిడిగా మహేష్, నమ్రతల పెళ్లి జరగడానికి కారణం ఆ హీరోయినేనా.?

హడావిడిగా మహేష్, నమ్రతల పెళ్లి జరగడానికి కారణం ఆ హీరోయినేనా.?

సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతల పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. సెలబ్రిటీలు అన్నాక తమ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. కానీ అటు బాలీవుడ్ స్టార్ హీరోయినైనా నమ్రత ఇటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయినప్పటికీ వీరి వివాహం చాలా సింపుల్ గా జరుపుకున్నారు. దాంతో అప్పట్లో వీరి పెళ్లిపై ఎన్నో రూమర్స్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే నమ్రత మహేష్ బాబు ల పెళ్లి హడావిడిగా జరగడానికి ఆ హీరోయిన్ కారణం అంటూ టాలీవుడ్ మీడియాలో ఓ రూమర్ వైరడ్ అయింది.

అదేంటంటే.. మహేష్ బాబు తో నటించే ఓ హీరోయిన్ ప్రేమలో మహేష్ ఎక్కడ ప్రేమలో పడిపోతాడోనన్న భయంతో నమ్రత హడావిడిగా పెళ్లి చేసుకుందానే న్యూస్ హల్ చల్ చేసింది. అసలు విషయంలోకి వెళ్తే..నమ్రత మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత మహేష్ అతడు సినిమాలో త్రిష ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష,మహేష్ బాబు మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. దాంతో వెంటనే వచ్చిన సైనికుడు మూవీలో కూడా త్రిషని హీరోయిన్ గా తీసుకున్నారు చిత్ర యూనిట్.

అయితే వీరి కెమిస్ట్రీ గురించి టాలీవుడ్ లో ఉన్న కొంత మంది గుసగుసలు పెట్టుకోవడంతో ఈ విషయం కాస్తా నమ్రత చెవిన బడి ఎక్కడ మహేష్ బాబుని త్రిష తన వలలో వేసుకుంటుందోనని భయపడి రాత్రికి రాత్రే ముహూర్తం పెట్టుకొని హడావిడిగా నమ్రత మహేష్ బాబు తో పెళ్లి చేసుకుంది అంటూ ఓ ఫన్నీ వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఈ వైరల్ అయిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని చాలామంది మహేష్ సన్నిహితులు కొట్టి పారేశారు.కానీ కొంతమంది గాసిప్ రాయుళ్ళు కావాలనే ఈ వార్తని వైరల్ చేశారని క్లారిటీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news