మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్‌లో ఇప్పుడు తిరిగిలేని స్టార్ డైరెక్టర్. రచయితగా కెరీర్ ప్రారంభించిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. తరుణ్, శ్రేయ జంటగా వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో మెగాఫోన్ పట్టి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు. రెండో ప్రయత్నంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతడు సినిమా తెరకెక్కించారు. అక్కడ నుంచి త్రివిక్రమ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినప్పుడు త్రివిక్రమ్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఆ వెంటనే ఎన్టీఆర్ తో అరవింద సమేత, బన్నీతో అలవైకుంఠపురంలో.. ఈ సంక్రాంతి మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలు చేసి వరుస సూపర్ డూపర్ హిట్లతో దూసుకుపోతున్నారు.
త్రివిక్రమ్ స్వయంవరం సినిమాతో టాలీవుడ్ లో రచయితగా పరిచయం అయ్యారు. స్వయంవరం కంటే ముందే వేణు, భారతీయరాజ దర్శకత్వంలో హీరోగా నటించే అవకాశం అందుకున్నాడు. ఆ సినిమా అనుకోని కారణాలతో ఆగిపోయింది. దీంతో వేణు స్నేహితుడు వెంకటశ్యాం ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి మొదటి సినిమాగా స్వయంవరం నిర్మించారు. ఈ సినిమాతో వేణు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ కూడా అందుకున్నారు. అప్పటినుంచి వేణు ఎక్కువగా సొంత సంస్థలోనే సినిమాలు చేస్తూ వచ్చారు.
చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, గోపి గోపిక గోదావరి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ దమ్ము సినిమాలో కూడా కనిపించారు. ఇటీవల రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వెండితెరపై తళుక్కున మెరిశారు. అయితే వేణు హీరోగా మాత్రం టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయాడు. అయితే ఒకేసారి కెరీర్ మొదలుపెట్టిన వేణు, త్రివిక్రమ్లలో.. వేణు ఫేడ్అవుట్ అయిపోయాడు.
త్రివిక్రమ్ మాత్రం స్టార్ డైరెక్టర్గా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎవరివల్ల ఎవరు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు అంటే దానికి సమాధానం చెప్పడం కష్టమే. ఇక్కడ ఎవరికి ఎవరు లైఫ్ ఇవ్వలేదు. టాలెంట్ వల్లే ఒకరు దర్శక రచయితగా ఈరోజు టాప్ పొజిషన్‌లో నిలబడితే టాలెంట్ ఉండి కూడా లక్‌లేక వేణు కుర్ర హీరోల పోటీ తట్టుకోలేకపోయాడు. ఏది ఏమైనా వేణు కెరీర్ ప్రారంభంలో తన సినిమాలకు వరుసగా అవకాశాలు ఇచ్చి త్రివిక్రమ్‌ను ఎంకరేజ్ చేసిన మాట మాత్రం నిజం.