Moviesఅఖిల్ ఫ్యూచ‌ర్.. చిరంజీవి చేతిల్లో ఉందా.. ఇదేం ట్విస్ట్ సామీ..?

అఖిల్ ఫ్యూచ‌ర్.. చిరంజీవి చేతిల్లో ఉందా.. ఇదేం ట్విస్ట్ సామీ..?

అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ కెరీర్ ఏ మాత్రం పుంజుకోవటం లేదు. ఎప్పుడో 2017లో వచ్చిన అఖిల్ సినిమా నుంచి 2023 లో వచ్చిన ఏజెంట్ సినిమా వరకు వరుస‌పెట్టి డిజాస్టర్ ల మీద డిజాస్టర్లు ఇస్తున్నాడు. మధ్యలో ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే యావరేజ్ గా ఆడింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ ఏకంగా రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యాక అఖిల్ సినిమా ఏది పట్టాలెక్కలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ ఒక సినిమా చేయాలి.. అనిల్ దర్శకుడు. ఈ సినిమా బడ్జెట్ రు. 100 కోట్లు. ఈ సినిమాపై అధికారిక‌ ప్రకటన వచ్చింది.

ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. అయితే అఖిల్ ఫ్యూచర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల్లో ఉంది. అసలు కథ ఏంటంటే యూవీ సంస్థ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉన్న పెట్టుబడి అంతా చిరంజీవి విశ్వంభర‌ సినిమాపై పెట్టేసింది. దాదాపు రు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో విశ్వంభర‌ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది.. ఈ సినిమా లావాదేవీలు అన్ని పక్కాగా జరగాలి.. సినిమా మంచి సక్సెస్ సాధించాలి.. అప్పుడు యూవీ సంస్థ కోలుకుంటుంది. ఆ తర్వాతే అఖిల్‌ సినిమా మొదలు పెట్టాలన్న ఆలోచనలో యూవీ సంస్థ ఉంది.

అంటే అప్పటివరకు అఖిల్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందా ? అన్న అనుమానాలు ఉన్నాయి. ఇక విశ్వంభర బిజినెస్ క్లోజ్ అయ్యేంతవరకు అఖిల్ సినిమా అలాగే పెండింగ్లో ఉంటుందా ? అన్న అనుమానాలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. పైగా సోషియో ఫాంట‌సీ అంటే ఆ క్రేజీ వేరు.. అన్నింటికన్నా ముఖ్యంగా సంక్రాంతి సీజన్ సినిమా కావడంతో బయ్యర్లు ఎక్కువగా చిరు సినిమా వైపు మొగ్గు చూపించడంతోపాటు భారీగా అడ్వాన్సులు ఇస్తారని అంటున్నారు.

కనీసం నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ క్లోజ్ అయ్యి అడ్వాన్సులు వస్తే అప్పుడు అఖిల్‌ సినిమా మొదలుపెట్టవచ్చని యూవీ సంస్థ ఆలోచనగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికే తీసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. చాలా ఏళ్ల పాటు అఖిల్ ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే 2024 సంవత్సరం క్యాలెండర్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు చిరంజీవి విశ్వంభరపైనే అఖిల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆధారపడి ఉందని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news