టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా 2001లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది దివంగత అందాలభామ్మ ఆర్తి అగర్వాల్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో ఆర్తి అగర్వాల్ పట్టిందల్లా బంగారం అయింది. నాలుగేళ్ల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేకుండా వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయింది. అటు సీనియర్ హీరోల నుంచి ఇటు మిడిల్ రేంజ్ హీరోల వరకు ఎవరి సినిమా చూసిన ఆర్తి అగర్వాల్ హీరోయిన్.
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల నుంచి ఎన్టీఆర్, మహేష్ బాబు, ఉదయ్‌కిరణ్, తరుణ్ లాంటి కుర్ర హీరోల వరకు అందరితో కలిసి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే.. హీరో తరుణ్‌తో ప్రేమాయణం విఫలం కావడం.. అప్పటినుంచి ఆమె కెరరీర్ పతనమవుతూ వచ్చింది. ఇక ఆమె చనిపోయిన చాలా ఏళ్ల తర్వాత ఆమెను టాలీవుడ్ లో అందరూ ఎలా వాడుకున్నారో.. ఒక దర్శకుడు పచ్చి నిజాలు ఆమె గురించి బయటపెట్టారు.
ఆ దర్శకుడు ఎవరో కాదు.. అమ్మ రాజశేఖర్. అమ్మ రాజశేఖర్ పేరు వింటేనే అందరికీ మాస్ సాంగ్స్ గుర్తొస్తాయి. సినిమాలో మాస్ సాంగ్ ఉంటే అది ఖచ్చితంగా అమ్మ రాజశేఖర్‌తోనే చేయించేవారు. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్.. గోపీచంద్, తరుణ్ సినిమాలు తీసి డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత టక్కరి, ఖతర్నాక్ లాంటి సినిమాలు కూడా చేసినా అవి డిజాస్టర్ అయ్యాయి. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి తర్వాత తాను హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేశారు.
ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్. ఆ టైంలో ఆమె ఫేడ్ అవుట్ స్టేజ్‌లో ఉంది. ఆ సినిమా షూటింగ్ టైంలో అర్తి అగర్వాల్.. తనను ఎలాంటి పెద్ద నిర్మాణ సంస్థలో పనిచేసిన ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. అందరూ వాడుకున్నారని.. ఇప్పుడు దూరం పెట్టారని ఏడ్చేసిందట. ఆ టైంలో అమ్మ రాజశేఖర్ చాలా సపోర్ట్ చేసి నీకు మంచి లైఫ్ ఇస్తానని ధైర్యం చెప్పారట. ఈ విషయాన్ని ఆర్తి మృతి చెందిన తర్వాత చాలా రోజులకు అమ్మ రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు.