Moviesమ‌హేష్ బాబు-రాజ‌మౌళి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌.. నిజంగా అదిరిందయ్యో..!

మ‌హేష్ బాబు-రాజ‌మౌళి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌.. నిజంగా అదిరిందయ్యో..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మహేష్-రాజమౌళి కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌హేష్ బాబుతో చేయ‌బోయే సినిమాకు మహారాజ్‌, చక్రవర్తి వంటి టైటిల్స్ ను రాజ‌మౌళి ప‌రిశీలిస్తున్న‌ట్లుగా మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది.

కానీ ఇప్పుడు అవేమి కాకుండా గోల్డ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను రాజ‌మౌళి ఫిక్స్ చేశాడంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో సైతం రాజ‌మౌళి సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అన్ని భాష‌ల‌కు సెట్ అయ్యే విధంగా యూనివర్సల్ టైటిల్ గోల్డ్ ను లాక్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు టైటిల్ అదిరింద‌ని సోష‌ల్ మీడియా ద్వారా త‌మ అభిప్రాయ‌డం తెలియ‌జేశారు.

కాగా, ఆగ‌స్టు 9న మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే. ఆ రోజు టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండొచ్చ‌ని అంటున్నారు. యాక్షన్‌ అడ్వెంచర్ థ్రిల్ల‌ర్ గా రూపొందనున్న ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. మ‌హేష్ బాబు కెరీర్ లో 29వ ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీలో ఇండోనేసియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా నటిస్తుందనే టాక్ ఉంది. అయితే దీనిపై కూడా ఎటువంటి అఫీషియ‌ల్ అప్డేట్ లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news