Moviesఆ హీరోయిన్‌తో తిరిగితే కాలు విరగ్గొడతాం... గోపీచంద్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ వెన‌క‌..?

ఆ హీరోయిన్‌తో తిరిగితే కాలు విరగ్గొడతాం… గోపీచంద్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ వెన‌క‌..?

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నారు..అయితే చాలామంది హీరోలు కేవలం హీరోయిజాన్ని మాత్రమే చూపిస్తారు. కానీ కొంతమంది హీరోలు మాత్రమే అటు హీరోయిజాన్ని ఇటు విలనిజాన్ని పండించగల నటులు. ఇక అలాంటి హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు. టాలీవుడ్ లో మ్యాచో స్టార్ గా పేరొందిన ఈయన తొలివలపు మూవీతో మొదటిసారి తెలుగు చిత్ర సీమ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదటి సినిమా ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఈయనకు హీరో అవకాశాలు మాత్రం రాలేదు.

కానీ తేజ దర్శకత్వంలో వచ్చిన జయం మూవీలో నితిన్ కి విలన్ గా గోపీచంద్ నటించారు.అలా మొదటిసారి తన విలనిజంతో గోపీచంద్ అందరినీ అట్రాక్ట్ చేశారు. అంతేకాకుండా వర్షం సినిమాలో ప్రభాస్ కి విలన్ గా,నిజం సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా అదరగొట్టేశారు. ముఖ్యంగా తన కటౌట్ తో అటు హీరోయిజాన్ని ఇటు విలనిజాన్ని పండించారు. అయితే వరుసగా మూడు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించిన గోపీచంద్ కి మళ్లీ యజ్ఞం సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది.ఇక యజ్ఞం మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో గోపీచంద్ పూర్తిగా హీరోగానే మారిపోయారు.

ఒకవేళ అవకాశం వస్తే ఏ హీరోకి మళ్ళీ విలన్ గా చేస్తారు అంటే ప్రభాస్ కి విలన్ గా చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అయితే అలాంటి గోపీచంద్ ని ఆ హీరోయిన్ తో తిరిగితే కాళ్లు విరగ్గొడతామని బెదిరించింది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. అప్పట్లో గోపీచంద్ హీరోయిన్ అనుష్కతో శౌర్యం, లక్ష్యం అనే రెండు సినిమాల్లో నటించారు. ఇక గోపీచంద్ సినిమాల్లో ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది.అదేంటంటే ఆయన సినిమా పేరు చివర లక్ష్యం,యజ్ఞం, రణం,లౌక్యం,శౌర్యం ఇలా టైటిల్స్ చివర ఉంటే కచ్చితంగా అవి బ్లాక్ బస్టర్ హిట్ అనే సెంటిమెంట్ ఉంది.

అయితే గోపీచంద్ గతంలో అనుష్కతో తీసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేసరికి వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది.కానీ ఫ్రెండ్షిప్ తో పాటు ఫిలిం సర్కిల్స్లో రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్స్ గోపీచంద్ ఇంట్లో వాళ్లకి కూడా తెలిసాయట.ఇక గోపీచంద్,అనుష్క కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో వీరి కెమిస్ట్రీని దృష్టిలో పెట్టుకొని ఓ డైరెక్టర్ గోపీచంద్ చేయబోయే నెక్స్ట్ సినిమాలో కూడా అనుష్కని హీరోయిన్ గా సెట్ చేశారట.

అయితే ఈ విషయం తెలుసుకున్న గోపీచంద్ ఫ్యామిలీ వాళ్ళు ఇంకొకసారి నువ్వు ఆ హీరోయిన్ తో తిరిగినా.. నటించినా నీ కాళ్లు విరగ్గొడతాం.. అసలు నువ్వు ఆ హీరోయిన్ తో నటిస్తే మీడియాలో ఎన్ని రూమర్స్ వినిపిస్తున్నాయో గమనించావా అని అన్నారట. అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని గోపీచంద్ చెప్పినా కూడా ఫ్యామిలీ వాళ్ళు వినకపోవడంతో చేసేదేమీ లేక అప్పటినుండి గోపీచంద్ తన సినిమాలో అనుష్కను తీసుకోవడం మానేశారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news