ప్రముఖ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించి తాజాగా ఓ విచితమైన సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన రకుల్ కన్నడతో మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. తెలుగు సినిమాల ద్వారా స్టార్డమ్ సంపాదించుకుని తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పగా వేసేందుకు ప్రయత్నిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. రీసెంట్ గా భారతీయుడు 2 మూవీతో సౌత్ ప్రేక్షకులను పలకరించింది.
కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేసిన విజిలెంట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా భారతీయుడు 2 చిత్రాన్ని తెరకెక్కించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అయితే భారీ అంచనాల నడుమ జూలై 12న విడుదలైన భారతీయుడు మూవీ ఫ్లాప్ టాక్ తో డిజాస్టర్ దిశగా దూసుకుతోంది. కథలో దమ్ములేకపోవడం, సగదీత సన్నివేశాలు, శంకర్ మార్క్ మిస్ అవ్వడం, మ్యూజిక్ తదితరల అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి.
అయితే అటు తిరిగి ఇటు తిరిగి భారతీయుడు 2 పరాజయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాలోకి తీసేస్తున్నారు. ఆమె వల్లే సినిమా ఫ్లాప్ అయిందని తాజాగా కొత్త వాదన మొదలైంది. సీక్వెల్ చిత్రాల్లో రకుల్ యాక్ట్ చేస్తే వాటి పని ఇక అంతే అన్నట్టుగా కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, భారతీయుడు 2 తో పాటు కిక్ 2, మన్మథుడు 2 చిత్రాలను కూడా ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఈ మూడు సినిమాలు సిక్వెల్సే కాగా.. అందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కావడమనేది కామన్ పాయింట్. దీంతో సీక్వెల్ లో రకుల్ ఉంటే సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయం అనే సెంటిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా సర్క్యులేట్ అవుతోంది.