సినీ రంగంలో ఎంత టాలెంట్ ? ఉన్న కూడా ఒక్కోసారి మంచి కథలు ఎంపిక చేసుకోవడం పైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. అలాగే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. మనకు ఎంత టాలెంట్ ? ఉన్నది ఎంత స్టార్ హీరో అన్నది కాదు ముఖ్యం. మనం ఎంత గొప్పగా నటించినా.. మనం ఎంపిక చేసుకునే కథలు ఎంపిక చేసుకునే దర్శకులు చాలా ఇంపార్టెంట్. అందుకే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజ అంత అదృష్టం ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక్కోసారి పేపర్ మీద అద్భుతంగా అనిపించిన కథలు సిల్వర్ స్క్రీన్ మీద తేలిపోతాయి. స్క్రిప్ట్ దశలో సాదాసీదాగా అనిపించిన కథలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టు కొడతాయి.
అలాగే అనుకోని కారణాలతో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో వద్దకు వెళుతుంది. అలా ఒక బ్లాక్ బస్టర్ సినిమా మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వచ్చి ఆయన చేయక పోవడంతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దగ్గరికి వెళ్ళింది. అలా మోహన్ బాబు కెరీర్ లోనే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది.
ఆ సినిమా ఏదో కాదు అసెంబ్లీ రౌడీ. మోహన్ బాబు – దివ్యభారతి జంటగా బిగోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1990వ దశలో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించేసింది.
ఈ సినిమాలో పాటలు ఇప్పుడు వింటున్నా మ్యూజిక్ ప్రియులను మైమరచిపోయేలా చేస్తాయి. ఈ సినిమా ముందుగా పి. వాసు దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. తర్వాత దీనిని పి. వాసు తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయనకు కథ కూడా చెప్పారు. ఫస్ట్ సిట్టింగ్‌లోనే చిరంజీవికి కథ నచ్చినా.. అప్పట్లో బిజీ షెడ్యూల్… అది కాక రీమేక్ కావడంతో పెద్దగా ఎక్కలేదు. ఆ వెంటనే పరుచూరి బ్రదర్స్ మోహన్‌బాబుకు కథ చెప్పడం… కేవలం రెండు రోజుల్లో స్క్రీన్ ప్లే, డైలాగులు సెట్ చేసుకోవడం.. దర్శకుడిగా బి. గోపాల్‌ను ఎంపిక చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.
చివరకు అసెంబ్లీ రౌడీ సూపర్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు ఏకంగా యేడాది పాటు ఆడింది. అలా చిరంజీవి చేయాల్సిన అసెంబ్లీ రౌడీ మోహన్‌బాబు చేతికి చిక్కి కొన్నేళ్ల పాటు మోహన్‌బాబు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.