మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కెరీర్ ప్రారంభం నుంచి కథల ఎంపికలో అన్ని తానే వ్యవహరించారు చరణ్. మేనమామ అయిన చిరంజీవి బావమరిది అల్లు అరవింద్.. రామ్ చరణ్ సినిమాలకు కథలు విని ఓకే చెప్పే బాధ్యత అంతా చిరంజీవి.. అల్లు అరవింద్ మీద పెట్టారు. అదే టైంలో చిరంజీవి రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య ఎక్కడో చిన్నపాటి గీత వచ్చిందన్న పుకార్లు ఉన్నాయి. అప్పటినుంచి చిరంజీవి స్వయంగా రామ్ చరణ్ సినిమాల కథలు విని ఓకే చేస్తున్నారు. అయితే ఓ డైరెక్టర్ పై నమ్మకంతో చిరంజీవి కథ వినకుండా సినిమా ఓకే చేశారు. ఫలితంగా చరణ్ ఆ సినిమా చేసి డిజాస్టర్ కొట్టాడు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలు ఎలా..? ఉంటాయో అందరికీ తెలిసిందే. కృష్ణవంశీ సినిమాలు అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే కావలసినంత రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్, కామెడీ కూడా మిక్స్ అయి ఉంటాయి. రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరివాడేలే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు నిర్మాత బండ్ల గణేష్. సినిమా షూటింగ్ విషయంలోనే బండ్ల గణేష్‌కు.. దర్శకుడు కృష్ణవంశీకు మధ్య గొడవలు జరిగాయి.
కృష్ణవంశీ వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఏ హీరో దొరకటం లేదు. ఆ టైంలో కృష్ణవంశీ చెప్పిన కథ రామ్ చరణ్‌కి బాగా నచ్చింది. చరణ్ వెళ్లి అదే మాట చిరంజీవితో చెప్పాడు. వెంటనే చిరంజీవి.. కృష్ణవంశీని కలవమని చెప్పారు. కృష్ణవంశీ వెళ్లి చిరంజీవిని కలిశారు. వెంటనే చిరు ఒక మాట చెప్పారు. నువ్వేం చెప్పావో తెలియదు.. వాడేమీ విన్నాడో తెలియదు.. సినిమా మాత్రం బాగా రావాలని చెప్పారు. అలా గోవిందుడు అందరివాడే సినిమా మొదలైంది.
సినిమా అంచనాలు అందుకోలేదు. నిర్మాత బండ్ల గణేష్ కు నష్టం వచ్చింది. అది భరించలేక బండ్ల గణేష్.. కృష్ణవంశీ పై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.. ఇక కృష్ణవంశీకి ఒక పెద్ద హీరో అవకాశం ఇచ్చిన చివరి సినిమాగా గోవిందుడు అందరివాడేలే మిగిలిపోయింది. ఆ తర్వాత ఏ పెద్ద హీరో కృష్ణవంశీని దగ్గరకు రానివ్వలేదు.