Moviesక‌న్న కూతురితో కూడా రొమాన్స్ చేస్తాడు.. క‌మ‌ల్ హాస‌న్ పై సుమ‌న్...

క‌న్న కూతురితో కూడా రొమాన్స్ చేస్తాడు.. క‌మ‌ల్ హాస‌న్ పై సుమ‌న్ షాకింగ్ కామెంట్స్‌!

సీనియర్ నటుడు సుమన్ తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సుమన్.. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో చెయ్యని తప్పుకు ఒక కేసులో ఇరుక్కోవడం, జైలు పాలు కావడం చకచకా జరిగాయి. సుమన్ ఎదుగుదలను ఓర్చుకోలేని తోటి హీరోలే ఆయన్ను త‌ప్పుడు కేసులో ఇరికించారనే వాదన ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ఉంది.

ఏదేమైనప్పటికీ ఆ వివాదం సుమన్ కెరీర్ ను దెబ్బతీసింది. చాలా తక్కువ సమయంలోనే హీరోగా ఆయన ఫేడౌట్ అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సహాయక నటుడుగా, విలన్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక‌పోతే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమ‌న్‌.. తమిళ హీరోల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

త‌మిళ ఇండ‌స్ట్రీలో మొద‌ట ఎంజీఆర్, శివాజీ గణేశన్ స్టార్స్ గా ఉండేవారు. 70వ ద‌శ‌కం చివ‌ర్లో క‌మ‌ల్ హాస‌న్, ర‌జ‌నీకాంత్ వ‌చ్చారు. కాలేజ్ స్టూడెంట్స్ వారిని బాగా అనుస‌రించేవారు. విల‌న్ గా కెరీర్ స్టార్ చేసి హీరోగా మారిన ర‌జ‌నీకాంత్ స్టైల్, సిగరెట్ ఫ్లిఫ్స్, స్పీడ్ వాకింగ్ తో ట్రెండ్ సెట్ చేశాడు. స్టార్ గా ఎదిగాడు అని సుమన్ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక ఈ క్ర‌మంలోనే క‌మ‌ల్ హాస‌న్ గురించి సుమన్ మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ ఒక రొమాంటిక్ హీరో. కమల్ హాసన్ రొమాన్స్ చేస్తుంటే చాలా న్యాచుర‌ల్ ఉండేది. కమల్ హాసన్ కి యాక్టింగ్ అనేది గాడ్ గిఫ్ట్. అలాగే క‌థ డిమాండ్ చేస్తే అత‌ను ఏ సాహ‌సం చేయ‌డానికైనా రెడీగా ఉంటాడు. పాత్ర కోసం గుండు చేయించుకున్న హీరో అత‌ను, డీ గ్లామర్ రోల్స్ చేశాడు. తోటి హీరోల‌కు ఇన్స్పిరేషన్ అయ్యాడు. చివ‌ర‌కు క‌న్న కూతురు శృతి హాస‌న్ తో రొమాన్స్ చేయ‌మ‌న్నా ఆయన చేస్తారు. అది అందరికీ రాదు అంటూ సుమ‌న్ యూట్యూబ్ ఛానల్ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఈయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news