Moviesఒక‌ప్ప‌టి హీరో సురేష్ కొడుకును ఎప్పుడైనా చూశారా..?

ఒక‌ప్ప‌టి హీరో సురేష్ కొడుకును ఎప్పుడైనా చూశారా..?

ఒక‌ప్ప‌టి హీరో సురేష్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 90వ ద‌శ‌కంలో మంచి ఫామ్ లో ఉన్న హీరోల్లో సురేష్ కూడా ఒక‌రు. త‌మిళ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన సురేష్‌.. పుట్టింటిపట్టుచీర మూవీతో టాలీవుడ్ లోకి వ‌చ్చాడు. 1991లో విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆ త‌ర్వాత ప్రార్థన, సూరిగాడు, అల్లరి పిల్ల, అమ్మోరు, దొంగాట, పట్టుకోండి చూద్దాం, దేవీ పుత్రుడు, శివుడు.. ఇలా వ‌రుస తెలుగు చిత్రాల్లో సురేష్ న‌టించారు.

ఫ్యామిలీ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్నారు. హీరోగా ఫేడౌట్ అయ్యాక స‌హాయ‌క న‌టుడిగా, విల‌న్ గా కొన్నాళ్లు ఇండ‌స్ట్రీలో కొన‌సాగారు. తెలుగు మ‌రియు త‌మిళ భాష‌ల్లో 274పైగా చిత్రాల్లో నటించారు. అలాగే బుల్లితెర‌పై మై నేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహలక్ష్మి, రాజేశ్వరీ కళ్యాణం త‌దిత‌ర సీరియ‌ల్స్ లో వ‌ర్క్ చేశారు. మ‌ధ్యలో కెమెరాకు కొన్నాళ్లు దూరంగా ఉన్న సురేష్‌.. ఇటీవ‌ల నీ దారే నీ కథ మూవీతో వెండితెర‌పై రీఎంట్రీ ఇచ్చారు.

ఇక‌పోతే న‌టుడిగా సురేష్ సినీ ప్రియులంద‌రికీ సుప‌రిచిత‌మే. కానీ ఆయ‌న ఫ్యామిలీ విశేషాల గురించి చాలా మందికి తెలియ‌దు. హీరోగా మంచి ఫామ్ లో ఉన్న‌ప్పుడే సురేష్.. అనిత అనే మ‌హిళ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1990లో వీరి వివాహం జ‌ర‌గ‌గా.. 1995లో మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత రాజశ్రీ అనే రచయిత్రిని సురేష్ రెండో వివాహం చేసుకోగా.. అనిత అమెరికాకు చెందిన వ్య‌క్తిని మ‌ళ్లీ పెళ్లి చేసుకుంది.

అయితే సురేష్‌-అనిత దంప‌తుల‌కు ఒక కుమారుడు ఉన్నాడు.. అత‌ని పేరు నిఖిల్ సురేష్‌. ఇత‌ను త‌న త‌ల్లి అనిత‌తోనే ఉంటూ ఎంబీఏ పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. తాజాగా సురేష్ కొడుకు నిఖిల్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిఖిల్ ను చూసిన నెటిజ‌న్లు సురేష్ కి ఇంత పెద్ద కుమారుడు ఉన్నాడా? అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news