సీనియర్ నటి గౌతమి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శ్రీకాకుళంలో జన్మించిన గౌతమి.. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో దయామయుడు మూవీతో నటనా రంగప్రవేశం చేసింది. గాంధీనగర్ రెండోవీధి మూవీతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత గురు శిష్యన్ తో తమిళంలోకి అడుగుపెట్టి.. అక్కడ అనతి కాలంలో అగ్రతారగా ఎదిగింది. రజనీకాంత్, కమల్‌హాసన్ తో సహా తమిళంలో అగ్రహీరోలందరితో గౌతమి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
అలాగే తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పదుల కొద్ది సినిమాల చేసింది. 80, 90 దశకాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. 1998లో సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను గౌతమి వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. 1999లో ఈ దంపతులకు సుబ్బులక్ష్మి అనే కుమార్తె జన్మించగా.. అదే ఏడాది మనస్పర్థలతో సందీప్ భాటియా-గౌతమి విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత కూతురికి ఏ లోటు రాకుండా చూసుకోవడానికి గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, సహాయక నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. 2005 నుంచి నటుడు కమల్ హాసన్ తో గౌతమి సహజీవనం స్టార్ట్ చేసింది. దాదాపు 13 ఏళ్లు పెళ్లి చేసుకోకుండా ఈ జంట కలిసి ఉన్నారు. 2016లో కమల్ హాసన్, గౌతమి తమ బంధానికి ముగింపు పలికారు.
ప్రస్తుతం కూతురు సుబ్బలక్ష్మితో గౌతమి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. సుబ్బలక్ష్మి విషయానికి వస్తే.. తల్లి గౌతమినే డామినేట్ చేసేంత అందంగా ఆమె ఉంటుంది. గ్లామర్ విషయంలో చాలా మంది స్టార్ హీరోయిన్లు సైతం సుబ్బలక్ష్మి ముందు బేజారైపోతారు. ఇక సోషల్ మీడియాలో సుబ్బు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇండస్ట్రీలోకి రాకముందే ఇన్‌స్టాగ్రామ్ లో 50 వేలకు పైగా ఫాలోవర్స్ ను ఆమె సంపాదించుకుంది. ఒకవేళ సుబ్బు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందంటే ఇండస్ట్రీని ఏలేయడం ఖాయం.