సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనకు వెన్నుదన్నుగా ఉండేవారు హరికృష్ణ. ఎన్టీఆర్ కి సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి చూసుకునేవారు. అలా తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ పేరు తెచ్చుకున్నారు.ఆ తర్వాత కొద్ది రోజులకు సినిమాల్లో కూడా రాణించారు. అయితే అలాంటి హరికృష్ణ కి సీనియర్ ఎన్టీఆర్ కి మధ్య దాదాపు రెండు సంవత్సరాలు మాటలు లేవు అనే సంగతి చాలామందికి తెలియదు.ఈ విషయం కేవలం ఆయన సన్నిహితులకు,దగ్గరి వాళ్లకి మాత్రమే తెలుసు.
మరి తండ్రి కొడుకుల మధ్య రెండు సంవత్సరాలు మాట్లాడుకునేంత వైరం ఎందుకు వచ్చింది..
ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఆ స్టార్ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ తమ ఇంట్లో ఎవరికి భయపడపోయేవారు కానీ ఒక్క హరికృష్ణ అన్నయ్యకి మాత్రం భయపడే వారని బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మా ఇంట్లో నాన్నని ఎదిరించే ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి హరికృష్ణ అన్నయ్య అని చెప్పారు. అయితే అలాంటి హరికృష్ణ కి సీనియర్ ఎన్టీఆర్ కి మధ్య రెండు సంవత్సరాలు మాటల్లేక పోవడానికి కారణం.. హరికృష్ణ ఓసారి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి నాన్న నేను థియేటర్ బిజినెస్ లోకి వెళ్తాను.థియేటర్ కట్టాలి అనుకుంటున్నాను మీ అభిప్రాయం చెప్పండి అని అడిగారట.
దానికి సరే తర్వాత ఈ విషయం గురించి ఆలోచిద్దాం అని ఇదే విషయాన్ని తన స్నేహితుడు తోటి హీరో అయినటువంటి ఏఎన్ఆర్ దగ్గర ప్రస్తావించారట. దానికి ఏఎన్ఆర్ థియేటర్ ఎందుకు పెద్ద స్టూడియో కడితే బాగుంటుంది కదా అని అన్నారట. ఇక ఏఎన్ఆర్ సలహా బాగుండడంతో థియేటర్ కాకుండా స్టూడియో నిర్మాణం చేపట్టారు. దాంతో థియేటర్ కట్టించమంటే సైలెంట్ గా ఉండి స్టూడియో కడుతున్నారు అని కోపంతో హరికృష్ణ దాదాపు రెండేళ్లు సీనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడలేదట.
కానీ ఆ తర్వాత థియేటర్ కి బదులే ఈ స్టూడియో కట్టారు అని నిజం తెలుసుకున్న హరికృష్ణ మళ్లీ తండ్రి దగ్గరికి వచ్చి పొరపాటు అయిపోయిందని క్షమించమని అడిగారట. అలా ఏఎన్ఆర్ ఇచ్చిన సలహా వాళ్ళ హరికృష్ణ నిర్ణయాన్ని కాదని ఏఎన్ఆర్ చెప్పినట్లు స్టూడియో కట్టారు సీనియర్ ఎన్టీఆర్.దాంతో తండ్రి కొడుకులు మధ్య దాదాపు రెండేళ్లు మాటల్లేవు.