వరలక్ష్మి శరత్ కుమార్ .. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురే ఈ వరలక్ష్మి శరత్ కుమార్ . కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకోలేకపోయిన వరలక్ష్మి ఆ తర్వాత విలన్ షేడ్శ్ లో నటించి మెప్పించింది. తెలుగులో కూడా సినిమాలలో విలన్ షేడ్శ్ పాత్రలో కనిపించి మెప్పించి అభిమానులను ఆకట్టుకుంది .
కాగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరి కొద్ది గంటల్లోనే పెళ్లి చేసుకోబోతుంది. ప్రముఖ వ్యాపారవేత్త నికోలై సచ్ దేవ్ తో దాదాపు 7 ఏళ్లు ప్రేమాయణం కొనసాగించిన ఈ బ్యూటీ రీసెంట్ గానే పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు . ఆ ఫోటోలో కూడా బాగా వైరల్ అయ్యాయి . కాగా జూలై రెండవ తేదీ ఆమె థాయిలాండ్ లో గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతుంది . ఇప్పటికే పెళ్లి పనులు మొత్తం పూర్తయిపోయాయి . పెళ్లి హడావిడి కూడా మొదలైపోయింది.
దక్షిణాది స్టార్ సెలబ్రిటీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా తన పెళ్లి పత్రిక పంచుతూ పెళ్లికి ఆహ్వానించింది వరలక్ష్మి శరత్ కుమార్ . తాజాగా ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు కాబోయే ఈ కొత్త జంట . వాటిల్లోని ఒక ఫోటోలో.. కాబోయే భర్త ని హగ్ చేసుకొని చాలా అన్యోన్యంగా కనిపించారు ఈ జంట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పుడు కూడా ఇలా నాటి యాంగిల్ లో కనిపించింది లేదు . ఎప్పుడు కూడా బోల్డ్ గా వైల్డ్ యాంగిల్ లోనే చూసాం ..తన భర్తతో ఇలా రొమాంటిక్ స్టిల్స్ చూసేసరికి ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు..!