ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్, టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో చెప్పక్కర్లేదు. కనివిని ఎరుగని రేంజ్‌లో దేవర, గేమ్ ఛేంజర్‌పై ఆకాశాన్నంటే రేంజ్ అంచనాలు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాను తమిళ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా.. దేవర సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాపై అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.
అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఓ కామన్ పాయింట్ కనిపిస్తోంది. ఇది ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ డ్యూయెల్ రోల్లో కనిపిస్తున్నారు. రెండు కూడా విభిన్నమైన పాత్రలే. గేమ్ ఛేంజర్‌లో రామ్‌చరణ్ తండ్రి, కొడుకు పాత్రలో కనిపిస్తున్నారు. తండ్రి రైతు పాత్రలో కనిపిస్తుంటే.. కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ కాగా.. సీనియర్ హీరోయిన్ అంజలి మరో కీలక పాత్రలో కనిపించబోతోంది.
ఇక దేవర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవర సినిమాలోనూ తండ్రీకొడుకుల పాత్రలో తారక్ కనిపిస్తాడు. ఈ రెండు సినిమాల్లోనూ స్టోరీలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే తండ్రికి అన్యాయం చేసిన వారిపై కొడుకులు పగ తీర్చుకుంటారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల నేపథ్యాలు వేరు అయినా.. కథలో పాయింట్ ఒక్కటే. ఇక గేమ్ ఛేంజర్ సినిమా సింగిల్ పార్ట్‌లో వస్తుండగా.. దేవర రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.