మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ ఫిదా. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. సాయిచంద్, రాజా చెంబోలు, శరణ్య ప్రదీప్, గీతా భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. అమెరికాలోని టెక్సాస్ లో డాక్టర్ చదువుతున్న అబ్బాయికి, తెలంగాణాలోని బాన్సువాడకి చెందిన అమ్మాయికి మధ్య సాగే ప్రేమ కథే ఫిదా.
ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విడుదలైన ఈ మూవీ ఎలాంటి విషయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూ. 13 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఫిదా.. ఫుల్ రన్ లో ఏకంగా రూ. 91 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే తెలుగులో తొలి సినిమా అయినప్పటికీ సాయి పల్లవి వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసింది. చలాకీగా, చిలిపిగా కనిపిస్తూ ప్రేమను పంచే మన పక్కింటి అమ్మాయిలా సాయి పల్లవి అదరగొట్టింది. తన నటన మరియు డ్యాన్సులతో వరుణ్ తేజ్ ను కూడా డామినేట్ చేసింది.
ఫిదాతో శేఖర్ కమ్ముల మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. వరుణ్ తేజ్ మార్కెట్ భారీగా పెరిగింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఫిదా మూవీలో హీరో క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ వరుణ్ తేజ్ కాదు. అవును, మీరు విన్నది నిజమే. వరుణ్ కన్నా ముందే టాలీవుడ్ కి చెందిన మరో ఇద్దరు హీరోల వద్దకు ఫిదా స్టోరీ వెళ్లింది. కానీ వాళ్లు ఏవేవో కారణాలతో తిరస్కరించారు.
ఇంతకీ ఫిదా వంటి బ్లాక్ బస్టర్ ను వదులుకున్న ఆ మోస్ట్ అన్ లక్కీ హీరోలు మరెవరో కాదు మహేష్ బాబు మరియు రామ్ చరణ్. గతంలో ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. మహేష్, రామ్ చరణ్ ఇద్దరికీ ఫిదా స్టోరీ వినిపించాను. కానీ వాళ్లిద్దరూ లైట్ తీసుకున్నారు. అయితే వాళ్లు రిజెక్ట్ చేసినందుకు తాను ఏమాత్రం ఫీల్ అవ్వలేదు, కథ ఎవరికి రాసి ఉంటే వారికే దక్కుతుంది అంటూ శేఖర్ కమ్ములు చెప్పుకొచ్చారు.