Moviesజూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ఆ సీనియ‌ర్ హీరోయిన్‌కు అలాంటి ఫీలింగ్ ఉందా..?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ఆ సీనియ‌ర్ హీరోయిన్‌కు అలాంటి ఫీలింగ్ ఉందా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. ఎన్టీఆర్‌కు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫాలోయింగ్ వచ్చేసింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమాతో తన పాన్ ఇండియా ఇమేజ్ మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్టీఆర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎన్టీఆర్ నటనకు, డైలాగులు చెప్పే తీరు, డ్యాన్స్‌లకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు. ఇండియాలోనే.. సౌత్ ఇండియాతో పాటు, నార్త్ ఇండియా స్టార్ హీరోలు సైతం ఎన్టీఆర్ నటన, డ్యాన్స్‌ను అమితంగా ఇష్టపడుతూ ఉంటారు.

ఇక త్రిబుల్ ఆర్ చూశాక ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ నట‌నని ఇష్టపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ అన్నా, నటన అన్న ఒకప్పుడు స్టార్ హీరోయిన్లకు ఎంతో ఇష్టం.. వాళ్లు కూడా ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ ఖుష్బూ.. మీ ఫ్యాన్ మూమెంట్ పంచుకోమని ప్రశ్నిస్తే.. అరవింద స్వామిని చూసినప్పుడు తనకో ఫ్యాన్ మూమెంట్ వస్తుందని.. అలాగే కమల్ సార్‌ని కలిసినప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది.

అలాగే జూనియ‌ర్‌ ఎన్టీఆర్ పేరు కూడా ఖుష్బూ చెప్పింది. ఎన్టీఆర్‌ను చూసినప్పుడు.. కలిసినప్పుడు.. వాహ్‌ దట్స్ తారక్.. ఆయన్ని కలిసాను అనే ఫీలింగ్ తనకు కలుగుతుందని ఖుష్బూ చెప్పింది. మొత్తంగా ఖుష్బూ.. ఎన్టీఆర్‌పై తన క్రష్ ఫీలింగ్ బయటపెట్టింది. అలాగే మరో సీనియర్ హీరోయిన్ రంభ సైతం తారక్ డ్యాన్స్ చూస్తుంటే మంత్రముగ్దురాలిని అయిపోతుందని చెప్పింది. గతంలో నయనతార, రష్మిక మందన్న కూడా అదే చెప్పారు. ఏదేమైనా ఎన్టీఆర్‌కు హీరోయిన్ల‌లో మామూలు పాపులారిటీ లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news