Moviesఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా.. తారక్ జాన్...

ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా.. తారక్ జాన్ జిగిడి దోస్త్..!!

ఎస్ ప్రెసెంట్ ఈ ఫోటో టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక అమ్మాయిని అనుకుంటే పప్పులో కాలేసినట్లే కానే కాదు .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నది ఒక అబ్బాయి ..అది కూడా ఒక స్టార్ హీరో . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతున్న పేరే ఇది . ఈ ఫోటో చూస్తే గుర్తుపట్టడం కష్టమే కానీ మీకు ఒక హింట్ ఇస్తాను.. ఈజీగా గుర్తుపట్టొచ్చు ..తనదైన స్టైల్ లో సినిమాలకు ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు ..ప్రమోషన్స్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు.. ఇప్పటికే చాలామందికి అర్థం అయిపోయింది అనుకుంటాను ..

ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరో మరెవరో కాదు మాస్ కా దాస్.. విశ్వక్సేన్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విశ్వక్సేన్ ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. కాగా త్వరలోనే మెకానిక్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. మరో మూడు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు విశ్వక్సేన్ .

తాజాగా కొత్త సినిమాని మొదలుపెట్టాడు. ఆల్రెడీ గతంలో లైలా అనే సినిమా చేయబోతున్నాడు విశ్వక్సేన్ అంటూ ప్రకటించాడు . షైన్ స్క్రీన్ నిర్మాణంలో రామ్ నారాయణ దర్శకత్వంలో ఈ మూవీ చేయబోతున్నాడు . ఈ సినిమాలో ఫస్ట్ టైం అమ్మాయి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు విశ్వక్సేన్. విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమా టీం తాజాగా విశ్వక్సేన్ ఫస్ట్ అమ్మాయిలుక్ రిలీజ్ చేశారు . చాలా నాటీగా చాలా క్యాచీగా కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్కి బాగా క్లోజ్ అయిపోయాడు విశ్వక్సేన్ . విశ్వక్సేన్ ప్రతి సినిమాను కూడా తారక్ ప్రమోట్ చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news