దీప్తి భట్నాగర్.. అంటే గుర్తుకురావడం కష్టమే. కానీ పెళ్లి సందడి సినిమా హీరోయిన్ అంటే మాత్రం తెలుగు ప్రేక్షకుల మదిలో ఆమె రూపం టక్కున మెదులుతుంది. కె. రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో పెళ్లి సందడి ఒకటి. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటిస్తే.. రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించారు. 1996 జనవరి 12న విడుదలైన పెళ్లి సందడి మూవీ సంలచన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.
పెళ్లి సందడి మూవీతో స్వప్న సుందరిగా కుర్రాళ్ళ గుండెల్లో కొలువైపోయింది దీప్తి భట్నాగర్. ఆమె అందానికి, అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దీప్తి.. 1995లో రామ శాస్త్రం అనే బాలీవుడ్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె రెండో చిత్రం పెళ్లి సందడి బిగ్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత దీప్తి తెలుగులో చేసిన చిత్రాలను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. అయితే బాలీవుడ్ లో మాత్రం 2004 వరకు బిజీ హీరోయిన్ గా గడిపింది.
కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే దీప్తి బాలీవుడ్ డైరెక్టర్ రణదీప్ ఆర్యను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. అయితే సినిమాలకు దూరమైనా కూడా దీప్తి భట్నాగర్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టింగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఉంటుంది.
అంతేకాదు నెట్టింట అందాల సునామితో అబ్బాయిల హార్ట్ బీట్ పెంచేస్తుంటుంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో క్లీవేజ్ షో చేస్తూ అందరి మతులు పోగొడుతుంటుంది. దీప్తి వయస్సు 55 అయినప్పటికీ.. ఆమె అందాల ఘాటు ఏమాత్రం తగ్గలేదు.