అఫ్కోర్స్ భార్యాభర్తలు అన్నాక గొడవ పడడం సహజం ..గొడవలు లేని కాపురాలు ఉంటాయా ..? చెప్పండి అలా గొడవలు పడుతూ సరదాగా గడిపితేనే సంసారం అనేది బాగా ముందుకు వెళుతుంది . అయితే సామాన్య జనాల మధ్య కాదు స్టార్ సెలబ్రెటీస్ మధ్య కూడా గొడవలు వస్తాయి . హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి జూనియర్ ఎన్టీఆర్ పై కోపం వస్తే ఏం చేస్తుంది..? అనే న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.
మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్కి కోపం ఎక్కువ.. స్పాట్లోనే ఆ కోపాన్ని చూపించేస్తాడు . ఆ తర్వాత ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు . అది వేరే మ్యాటర్ అయితే ఎప్పుడైనా సరే లక్ష్మీ ప్రణతి పై కోప్పడిన లేకపోతే ఎన్టీఆర్ పై లక్ష్మీ ప్రణతికి కోపం వచ్చిన.. వెంటనే లక్ష్మీ ప్రణతి వెళ్లి ఎన్టీఆర్ కెరియర్నే మలుపు తిప్పిన “ఆది” సినిమాని పెట్టుకుని చూస్తుందట . ఆమెకి ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ నటించిన మూవీస్ లల్లో ఆ సినిమానే బాగా ఇష్టమట .
మరీ ముఖ్యంగా ఆయన కోపం.. ఆవేశం.. ప్రేమ అన్ని ఎమోషన్స్ ఆ సినిమాలో కనిపిస్తాయట . అందుకే లక్ష్మీ ప్రణతికి ఎప్పుడు కోపం వచ్చినా సరే ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాను ప్లే చేసి చూస్తుందట. వెంటనే ఎన్టీఆర్ కోపం కూడా హుష్ కాకి అంటూ ఎగిరిపోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ కోపాన్ని కంట్రోల్ చేసేది లక్ష్మీ ప్రణతినే అంటూ ఫ్యాన్స్ సరదాగా మాట్లాడుకుంటున్నారు..!!