Moviesమ‌హేష్ బాబు త‌న లైఫ్ లో 100 సార్ల‌కు పైగా చూసిన...

మ‌హేష్ బాబు త‌న లైఫ్ లో 100 సార్ల‌కు పైగా చూసిన ఏకైక చిత్రం ఏదో తెలుసా?

సాధారణంగా ఒక సినిమా నచ్చిందంటే కొంద‌రు ప‌ది, ఇర‌వై సార్లు చూస్తుంటారు. బాగా నచ్చిందంటే ఇంకో పది సార్లు చూస్తుంటారు. కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు తన లైఫ్ లో ఒక చిత్రాన్ని వందకు పైగా సార్లు చూశారట. నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది అక్షర సత్యం. ఎందుకంటే, ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా తన నోటితో వెల్ల‌డించారు. ఇంతకీ మహేష్ బాబు వందసార్లకు పైగా చూసిన సినిమా ఏదో తెలుసా.‌. మోసగాళ్లకు మోసగాడు.

సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల జంటగా ఈ చిత్రంలో నటించారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించగా.. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై జి ఆదిశేషగిరిరావు నిర్మించారు. నాగభూషణం, గుమ్మడి, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, జ్యోతిలక్ష్మి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. 1971 ఆగస్టు 27న విడుదలైన మోసగాళ్లకు మోసగాడు చిత్రం సంచలన‌ విజయాన్ని నమోదు చేసింది. 100 రోజుల థియేట్రికల్ రన్ ను సాధించింది.

భార‌తీయ చిత్ర సీమలో వచ్చిన తొలి కౌబాయ్ చిత్రంగా ట్రెండ్ సెట్ చేసింది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 4కె క్వాలిటీతో 2023 మే 31న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయ‌డం కూడా జ‌రిగింది. ఇకపోతే కృష్ణ గారు తన కెరీర్ లో వందల చిత్రాలు చేసినప్పటికీ.. మహేష్ బాబు మోస్ట్ ఫేవరెట్ మాత్రం మోసగాళ్లకు మోసగాడు మూవీనే అట‌. 100 సార్లకు పైగా చూసేంతలా మహేష్ బాబు ఆ సినిమాను ఇష్టపడ్డారు. గతంలో ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మహేష్ స్వయంగా వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news