Movies"జయం" సినిమాలోని ఈ కుర్రాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? ఎవరిని...

“జయం” సినిమాలోని ఈ కుర్రాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒకప్పటి స్టార్ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఒకప్పుడు ఇండస్ట్రీలో చిన్నచికాత పాత్రలో నటించిన స్టార్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు..? అన్న విషయాలపై ఎక్కువగా సెర్చింగ్ మొదలుపెట్టారు జనాలు. తాజాగా సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ కుర్రాడి ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నితిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నడిచిన సినిమా జయం .

ఈ సినిమా భారీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా హ్యూజ్ కలెక్షన్స్ కూడా దక్కించుకునింది . ఈ సినిమా చిన్నప్పుడు గోపీచంద్ పాత్రలో నటించిన కుర్రాడు అందరికీ గుర్తు ఉండే ఉంటాడు. చాలా రూడ్ గా ఆ ఏజ్ లో తండ్రి మాటను వినకుండా ఉండే క్యారెక్టర్లు జీవించేసాడు . అయితే ఆ పిల్లాడి పేరు దిలీప్ కుమార్ . చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాల్లో నటించాడు . సీరియల్స్ లో కూడా నటించాడు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు .

ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ పిల్లాడు పెద్దోడు అయ్యాక కూడా ఒక సినిమాలో నటించాడు. దిక్సూచి అనే సినిమాలో నటించాడు కానీ ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. ఆయన నటన కూడా అంతంత మాత్రమే అంటూ చెప్పేశారు. దీంతో అతగాడు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయాడు . 2022లో ఒక డాక్టర్ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయాడు . చాలామంది హీరోగా నిలదొక్కుకోవాలని అనుకుంటే మాత్రం ఇండస్ట్రీలో ఉండలేరు అన్నది ఇతగాడి ఒపీనియన్ ..పెద్దగా సినిమాలు చేయకపోయినా ఫ్యామిలీ పరంగా వెల్ సెటిల్ అంటూ ప్రూవ్ చేసుకున్నాడు దిలీప్ కుమార్. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఏమీ సాధించలేమని మరొకసారి ప్రూవ్ చేశాడో దిలీప్ కుమార్. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఫ్యామిలీకి దగ్గరగా లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు దిలీప్ కుమార్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news