Moviesసుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ యాక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఏదో...

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ యాక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఏదో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ ఫ్రెండ్ష‌ప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దాదాపు ఇర‌వై ఏళ్ల నుంచి వీరి మ‌ధ్య బాండింగ్ ఉంది. అల్లు అర్జున్ హీరోగా న‌టించిన‌ ఆర్య మూవీతోనే సుకుమార్ ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. 2004లో విడుద‌లైన ఆర్య చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఆర్య 2, పుష్ప ది రైజ్ చిత్రాలు ఎలాంటి విజ‌యాల‌ను న‌మోదు చేశాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ముఖ్యంగా పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ కు ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డును తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్ లో పుష్ప 2 ది రూల్ తెర‌కెక్కుతోంది. పుష్ప 2 గురించి ప‌క్క‌న పెడితే.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేశాడ‌న్న విష‌యం మీకు తెలుసా.. అవును మీరు విన్న‌ది నిజ‌మే.

ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ఐ యామ్ దట్ చేంజ్. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ ల‌ఘు చిత్రంలో అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషించాడు. తనిష్క్ రెడ్డి, విక్రమ్ చైతన్య, సూర్య ఆశ్రిత్, త్రిష, శ్రీ వర్షిణి, భరత్ రెడ్డి ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. గీతా ఆర్ట్స్‌పై అల్లు అర్జున్ స్వ‌యంగా ఆ షార్ట్ ఫిల్మ్ ను నిర్మించారు.

ఐ యామ్ దట్ చేంజ్ షార్ట్ ఫిల్మ్ 68వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు అన‌గా 2014 ఆగ‌స్ట్ 14న‌ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో విడుదలైంది. యూట్యూబ్ లో విశేష‌మైన స్పంద‌న‌ను సొంతం చేసుకుంది. కేవలం మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ లో మన బాధ్య‌త మ‌నం నిర్వర్తించడం కూడా దేశభక్తే. మార్పు మనతోనే మొదలవ్వాలి. ఐ యామ్ దట్ చేంజ్ అంటూ అల్లు అర్జున్ చెప్ప‌డం హైలెట్ గా నిలుస్తుంది. ఒక‌వేళ మీరు గనుక ఐ యామ్ దట్ చేంజ్ షార్ట్ ఇంకా చూడ‌కుంటే కింద లింక్ ఉంది ఓ లుక్కేసేయండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news