టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో మన్మథుడు ఒకటి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సుధ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రను పోషించగా.. అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
2022 డిసెంబర్ 20న విడుదలైన మన్మథుడు చిత్రం ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించడమే కాకుండా నాగార్జునకి అక్కినేని మన్మథుడు అనే ట్యాగ్ ను తెచ్చిపెట్టింది. ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును అందుకుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన్మథుడు మూవీ నాగార్జన కాకుండా టాలీవుడ్ కు చెందిన మరో చేయాల్సిందట. కానీ మిస్ అయింది.
ఇంతకీ మన్మధుడు వంటి అద్భుతమైన చిత్రాన్ని కోల్పోయిన ఆ అన్ లక్కీ హీరో మరెవరో కాదు తరుణ్. కె. విజయ భాస్కర్ డైరెక్ట్ చేసిన నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావు వంటి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాసే కథ అందించారు. ఆ రెండు చిత్రాలు విజయవంతం కావడంతో త్రివిక్రమ్ మరో రెండు కథలు సిద్ధం చేసుకున్నాడు. అందులో మన్మథుడు స్టోరీ ఒకటి కాగా.. మరొకటి నువ్వే నువ్వే.
ఈ రెండు కథలను త్రివిక్రమ్ ఒక రోజు విజయ భాస్కర్ కు వినిపించగా.. ఆయనకు బాగా నచ్చాయి. అయితే అప్పటికే డైరెక్షన్ పై త్రివిక్రమ్ కు ఆసక్తి ఉంది. అది గమనించిన దర్శకుడు విజయ భాస్కర్ ఆ రెండు కథల్లో ఒకదాన్ని నువ్వే డైరెక్ట్ చేయమని త్రివిక్రమ్ కు సూచించారు. దాంతో త్రివిక్రమ్ నువ్వే నువ్వే కథను ఎంచుకుని తరుణ్ తో సినిమా చేస్తే.. మిగిలిన కథతో విజయ భాస్కర్ నాగార్జునను హీరోగా పెట్టి మన్మథుడు తీశారు. ఈ రెండు చిత్రాలు ఒకే ఏడాది విడుదలై హిట్ అవ్వడం మరొక విశేషం. ఇక ఒకవేళ ఆ రోజు త్రివిక్రమ్ నువ్వే నువ్వే స్టోరీ కాకుండా రెండో కథను ఎంపిక చేసుకునుంటే కచ్చితంగా మన్మథుడు సినిమా తరుణ్‌ది అయ్యుండేది.