సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. నిరుపేద కుటుంబంలో జన్మించిన రజనీకాంత్.. బస్ కండక్టర్ గా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత యాక్టింగ్ పై ఉన్న ఫ్యాషన్ తో సినిమా రంగం వైపు అడుగుల వేశారు. చిన్న చిన్న సహాయక పాత్రలు, విలన్ పాత్రలతో మొదలుపెట్టి హీరోగా నిలదొక్కుకున్నారు. సూపర్ స్టార్ గా ఎదిగారు.
ఎటువంటి సినీ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిన రజనీకాంత్ తమిళ ఇండస్ట్రీలోనే కాదు యావత్ ఇండియా వైడ్ గా నేమ్ అండ్ సేమ్ సంపాదించుకున్నారు. విదేశాల్లో సైతం విపరీతమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. అలాగే సుదీర్ఘ సినీ ప్రయాణంలో రజనీకాంత్ 170కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే అందులో ఒక హాలీవుడ్ మూవీ కూడా ఉందని మీకు తెలుసా.. అవును మీరు విన్నది నిజమే. రజనీకాంత్ తన కెరీర్ లో నేరుగా ఒక హాలీవుడ్ మూవీ చేశారు.
అయితే ఏదో గెస్ట్ రోల్ చేసుంటారులే అనుకుంటే పొరపాటే.. మెయిన్ లీడ్ లో రజనీకాంత్ నటించారు. ఆ సినిమా పేరు బ్లడ్ స్టోన్. అశోక్ అమృతరాజ్ మరియు సునంద మురళీ మనోహర్ నిర్మించిన యాక్షన్-అడ్వెంచర్ చిత్రమిది. డ్వైట్ హెచ్. లిటిల్ దర్శకత్వం వహించగా..బ్రెట్ స్టైమ్లీ, రజనీకాంత్ మరియు అన్నా నికోలస్ ప్రధాన పాత్రలను పోషించారు.
బ్లడ్ స్టోన్ అనే వజ్రం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. బెంగళూరులో మేజర్ షూటింగ్ జరిగింది. 1988లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రూ. 8 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తే.. రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక బ్లడ్ స్టోన్ మూవీని తమిళ భాషలో వైరవేల్ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. అయితే కోలీవుడ్ లో బ్లడ్ స్టోన్ కు అంతగా ప్రజాదరణ లభించలేదు.