సినిమా రంగంలో ఎవరైనా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలగాలి అంటే వాళ్లు నూటికి నూరు శాతం మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకోవాలి. చూడటానికి చాలా అందంగా ఉండాలి.. హీరోయిన్లకి నటన ఎంత ముఖ్యమో ?అందం కూడా అంతే ముఖ్యం. హీరోయిన్లు బ్రహ్మదేవుడు చెక్కిన శిల్పంలా ఉండాలి.. అయితే కొందరు హీరోయిన్లు తమలో ఉన్న అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి చిన్నచిన్న లోపాలు సరి చేసుకోవటానికి శాస్త్ర చికిత్సలు కూడా చేయించుకుంటారు. ఇది ఈ తరం హీరోయిన్లే కాదు.. అప్పటి తరం స్టార్ హీరోయిన్లు కూడా చేశారు. ఉదాహరణకు మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్ దివంగత అతిలోకసుందరి శ్రీదేవి ముక్కుకు చాలా శాస్త్ర చికిత్సలు జరిగాయని అంటారు.
శ్రీదేవి సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగాక బాలీవుడ్ కి వెళ్ళింది. అయితే బాలీవుడ్లో ఆమెకు క్రేజ్ ఉన్న ఆమె ముక్కు బండగా ఉండటంలో ఉండడంతో ఎక్కువమంది దర్శక నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసేవారట. దీంతో ఆమె అమెరికా వెళ్లి ముక్కును సూటిగా.. నిటారుగా సంపెంగ పువ్వు మాదిరిగా సర్జరీ చేయించుకుని మార్చుకుని వచ్చింది. ఇలా ఆమె ఏకంగా 16 సార్లు తన ముక్కుకు శస్త్ర చికిత్సలు చేయించుకుందని అంటారు. అలాగే పాతుతరం నటీమణులలో స్టార్ హీరోయిన్ జీ వరలక్ష్మి కూడా అంతే..!
ఆమె చూసేందుకు చాలా అందంగా ఉంటారు.. అయితే ముక్కు మాత్రం బండంగా ఉండడంతో కొందరు అవకాశాలు ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదట. ఆపరేషన్ చేయించుకుంటేనే అవకాశాలు వస్తాయని కొందరు నిర్మాతలు ఆమెకు సూచించిన ఆమె మాత్రం నో అని తేల్చి చెప్పారట. దేవుడు ఇచ్చిన అందమే అందం చాలు… అంతేగాని కోరి తగిలించుకోవలసిన అవసరం లేదు అని ఆమె మొండిపట్టు పట్టడంతో కొన్ని అవకాశాలు చేజారాయని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.