Moviesఅమితాబ‌చ్చ‌న్‌తో ప్రేమ ఫెయిల్ అయ్యాక రేఖ లైఫ్‌లో ఇంత దారుణం జ‌రిగిందా...

అమితాబ‌చ్చ‌న్‌తో ప్రేమ ఫెయిల్ అయ్యాక రేఖ లైఫ్‌లో ఇంత దారుణం జ‌రిగిందా ?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం.. ఇందులో నటించే నటీనటులు కూడా ఎన్నో ఇబ్బందులు,కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అలనాటి టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన నటి రేఖ నిజజీవితంలో కూడా చాలా కష్టాలను కూడా అనుభవించింది.. ఈమె అసలు పేరు భాను రేఖ.. మద్రాస్ ప్రాంతంలో జన్మించింది. ఎన్నో చిత్రాలలో ప్రేమ సన్నివేశాలలో అద్భుతంగా నటించిన రేఖ.. తన నిజ జీవితంలో మాత్రం ప్రేమను పొందలేకపోయింది. వివాహమైన కొద్ది రోజులకే ఆమె భర్త మరణించడం ఒక మాయని మచ్చగా మారిపోయింది.

అలాగే రేఖ స్టార్ హీరో తో కూడా ప్రేమాయణం కొనసాగించిందని వార్తలు కూడా వినిపించాయి. దీంతో నటి రేఖ మళ్ళీ వివాహం చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయింది.. 1980లో రేఖ, అమితాబ్ బచ్చన్ మొదటిసారి దో అంజనే అనే సినిమా షూటింగ్లో కలుసుకున్నారట.. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సుమారుగా 10 సినిమాలు వరకు వచ్చాయి. రేఖ ఎలాంటి విషయాలైనా సరే ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన జీవితంలో కొన్ని రహస్య విషయాలను కూడా తెలియజేసింది.

ముఖ్యంగా తాను బాధలో ఉన్న ప్రతిసారి మద్యం తాగేదాన్ని అంటూ తెలిపింది.. అతిగా మద్యం తాగినట్లుగా కూడా తెలియజేసింది.. అలాగే డ్రగ్స్ కూడా తీసుకునే దాన్ని అంటూ రేఖ సిమిగరేవాల్ ఇంటర్వ్యూలో తెలియజేసిందట. తన జీవితంలో ఎప్పుడూ చూడని నరకాన్ని సైతం చూశానని.. అయితే అలా ఎందుకు చేస్తున్నానని ఎవరైనా అడిగితే.. తాను జీవితంలో అన్ని పోగొట్టుకున్నానని.. ఆ విషయం ఎవరికీ చెప్పలేక తనలో తానే ఎన్నోసార్లు కుమిలిపోయానని తెలియజేసింది.

అలాగే హీరోయిన్ రేఖకు గర్గాంజ్ లో భారీ మొత్తంలో ఆస్తి ఉన్నదట. ఇలా ఎన్నో విలాసవంతమైన ఆస్తులు ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది… భర్త, పిల్లలు లేని ఈ నటి యొక్క కోట్ల ఆస్తి ఏమైపోతుందా అంటూ అందరిలోనూ ఒక ప్రశ్నగా మిగిలింది. సుమారుగా ఈమె ఆస్తి 400 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈమె ఆస్తి మొత్తాన్ని తన మేనేజర్ ఫర్జానాకు అప్పగించిందట.. ఆమె గత 32 ఏళ్లుగా హీరోయిన్ రేఖతోనే పనిచేస్తుందట. మరి ఈ ఆస్తి విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news