సినిమాల్లో అవకాశాలు రావాలంటే హీరోయిన్లకు ఫిట్ నెస్ అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఒక్కసారి షేప్ అవుట్ అయ్యారంటే మళ్ళీ వారి వంక కన్నెత్తి కూడా చూడరు. అందుకే హీరోయిన్లు ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. మన టాలీవుడ్ లో జీరో సైజ్ ను మెయింటైన్ చేసే ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. అయితే ఆ జీరో సైజ్ కారణంగానే రకుల్ గతంలో పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ సినిమాలో యాక్ట్ చేసే అవకాశాన్ని కోల్పోయిందని మీకు తెలుసా..? అవును మీరు విన్నది నిజమే.
ఇంతకీ ప్రభాస్, రకుల్ కాంబినేషన్ లో మిస్ అయిన మూవీ మరేదో కాదు మిస్టర్ పర్ఫెక్ట్. దశరధ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. మురళీ మోహన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, నాజర్, తులసి, సాయాజీ షిండే తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
2011లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా పాజిటివ్ టాక్ తో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 42 కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూల్ చేసింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో మొదట రకుల్ ప్రీత్ సింగ్ ను మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఐదు రోజులు షూటింగ్ కూడా జరిగింది. రష్ చూసేసరికి ఎవ్వరికీ నచ్చలేదు. కథ మొత్తం అమ్మాయి మీద ఉంది. కానీ చాలా సన్నగా ఉన్న రకుల్ ప్రియ పాత్రకు ఏ మాత్రం నప్పలేదు.
వర్కౌట్ అవ్వదని భావించిన దర్శకనిర్మాతలు.. ఐదు రోజులు అయ్యాక షూట్ ఆపేశారు. రకుల్ ను పీకేసి కొత్త హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు. అప్పుడే నిర్మాత దిల్ రాజు కాజల్ ను తీసుకోవాలని భావించారు. అయితే ఆ టైమ్ లోనే కాజల్ ప్రభాస్ తో కలిసి డార్లింగ్ చేస్తోంది. అయితేనేం అని చెప్పి.. కాజల్ ని అడగ్గా ఆమె ఓకే చెప్పింది. దాంతో రకుల్ ప్లేస్ ను కాజల్ తో రీప్లేస్ చేశారు. ఇక ప్రియగా కాజల్ అదరగొట్టిందనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ ను కూడా డామినేట్ చేస్తూ కాజల్ యాక్ట్ చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.