Moviesఆ విష‌యంలో ఎన్టీఆర్‌, బ‌న్నీ వెన‌క‌ప‌డిపోయారే... అందుకే ప‌ట్టించుకోలేదా ?

ఆ విష‌యంలో ఎన్టీఆర్‌, బ‌న్నీ వెన‌క‌ప‌డిపోయారే… అందుకే ప‌ట్టించుకోలేదా ?

ఏ రంగంలో అయినా ఒక స్టేజ్ కు వెళ్లిన కొద్ది సర్కిల్ అనేది కీలకంగా మారుతుంది. ఎవరికి ఎంత సర్కిల్ ఉంది అన్న మేరకే పార్టీలు ఆహ్వానాలు, హై ప్రొఫైల్ స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సర్కిల్ కోసమే సెలబ్రిటీలు ఎక్కువగా పార్టీలకు వెళుతూ ఉంటారు. పార్టీలు హోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా భారతదేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ కుమారుడి పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి మన తెలుగు హీరోలు కొందరు వెళ్లారు.. కొందరికి ఆహ్వానాలు అందలేదు. ఆహ్వానాలు అందని వారు ఎవరు ఉన్నారు అని చూస్తే.. బాలీవుడ్ సర్కిల్ల్స్ లో పెద్దగా పరిచయం లేని వారికి ఆహ్వానాలు అందలేదు. బాలీవుడ్ సర్కిల్ ఉన్నవారు వెళ్లారు.

రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఆ జంటకు చాలా హై ప్రొఫైల్ సర్కిల్ యాడ్ అయింది. హై ప్రోఫైల్‌ బిజినెస్ సర్కిల్.. అది అపోలో సంస్థ భాగస్వామిగా ఉపాసనకు ఉన్న సర్కిల్ అంతా.. ఇప్పుడు రామ్ చరణ్ కు తోడైంది. అందుకే అంబానీ ఇంట‌ పెళ్లికి ఈ దంపతులకు ఆహ్వానం అందింది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సతీమణి నంబర్ న‌మ్ర‌త శిరోద్క‌ర్‌ సర్కిల్ మొత్తం బాలీవుడ్.. అందువలన అంబానీలో ఇంట పెళ్లికి ఆహ్వానం అందింది. ఆ పెళ్లిలో మహేష్, సితార, నమ్రత చూడముచ్చటగా కనిపించారు. ఇక రానా మొదటి నుంచి ముంబై సర్కిల్ బాగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. పైగా రానా నాయుడుతో.. వెంకీ కూడా ముంబై బాలీవుడ్ సర్కిల్స్‌లో ఎంటర్‌ అయిపోయారు.

అందుకే వారికి కూడా అంబానీ ఇంట పెళ్లికి ఆహ్వానం అందింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు ఉపముఖ్యమంత్రి.. అంతకుమించి హోదా ఏముంటుంది.. పవన్ కళ్యాణ్ ను కచ్చితంగా పిలిచి తీరాలి.. పిలిచారు. పవన్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా కలిసి పెళ్లికి వెళ్లారు. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే ఈ బాలీవుడ్ ముంబై సర్కిల్ కు ముందు నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. వారు అక్కడ పరిచయమే కానీ.. ఆ సర్కిల్‌తో అంత క్లోజ్ అవ్వలేదు. అందుకే కావచ్చు ఈ ఫంక్షన్‌కు కూడా వారికి ఆహ్వానం అందలేదు అనుకోవాలి. అయితే త్వరలో ఎన్టీఆర్ దేవరతో, బన్నీ పుష్ప 2 సినిమాతో ఆ లోటు తీర్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news