Moviesబాల‌య్య‌కు న్యాయం చేసి.. కొడుకు ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన క్రేజీ హీరోయిన్‌..?

బాల‌య్య‌కు న్యాయం చేసి.. కొడుకు ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన క్రేజీ హీరోయిన్‌..?

టాలీవుడ్‌లో ఈ తరం స్టార్ హీరోయిన్లలో చాలామంది స్టార్ హీరోయిన్లు లక్కీ హీరోయిన్లు. అటు సీనియర్ హీరోలతో పాటు.. ఇటు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో కూడా కలిసి నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ అయితే మెగాస్లార్‌తో పాటు.. ఆయన తనయుడు రామ్ చరణ్.. ఇటు మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ సరస‌న కూడా నటించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోను సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో క‌లిసి న‌టించింది. అలా కాజ‌ల్‌ మెగా ఫ్యామిలీలో ఆ తరం నుంచి ఈ తరం హీరోల వరకు అందరితోనూ కలిసి నటించింది.

అయితే ఈ తరం కుర్ర క్రేజీ హీరోయిన్లలో ఒక హీరోయిన్ నందమూరి ఫ్యామిలిలో రెండు తరాలకు చెందిన హీరోలతో కలిసి నటించినా.. సీనియర్ హీరోకి మాత్రం సూపర్ హిట్ ఇచ్చి.. జూనియర్ హీరోకి మాత్రం డిజాస్టర్ సినిమా ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో ? కాదు శృతిహాసన్. లోకనాయకుడు కమలహాసన్ కూతురు. స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌ సినిమాకు జంటగా వచ్చి కూడా వీరసింహారెడ్డి సూపర్ హిట్ అయింది. అటు చిరంజీవి సినిమాలోను.. ఇటు బాలయ్య సినిమాలోను ఒకేసారి నటించి రెండు సినిమాలతో ఒకేసారి సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చి రెండు సూపర్ హిట్లు కొట్టింది శృతీహాసన్.

అలా బాబాయ్ బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన శృతిహాసన్.. నందమూరి వంశంలో తర్వాత తరం వారసుడు జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం డిజాస్టర్ సినిమా ఇచ్చింది. రామయ్య వస్తావయ్య సినిమాలో పల్లెటూరి యువ‌తి పాత్రలో శృతిహాసన్ నటించినా ఆమె స్టైల్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రామయ్య వస్తావయ్య సినిమాకు దిల్‌రాజు నిర్మాత కాగా.. హరీశంకర్ దర్శకుడు. సినిమా ఫస్ట్ అఫ్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్నా.. సెకండ్ ఆఫ్.. రొటీన్ కథ‌తో బోర్ కొట్టించింది. ఆ రోజుల్లోనే సినిమాకు ఫ్లాప్ టాక్‌ వచ్చినా కూడా.. ఏకంగా రూ.35 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అయితే నందమూరి వంశంలో అబ్బాయికి అదిరిపోయే షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. బాలయ్య బాబాయ్ కి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news